తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే అకౌంట్లలో డబ్బులు! రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 18 నుంచి రైతు భరోసా అందివ్వనున్నట్లు తెలిపింది. డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. By srinivas 15 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Rythu Bharosa : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది. మూడు విడతల్లో దాదాపు రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసారు. ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా.. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు సిద్దమైంది. తాజాగా.. రైతులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. . మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. Also Read : తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం.. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపసంఘం నివేదిక రాగానే.. వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. Also Read : గాడిద పాల దందాలో భారీ మోసం.. రూ.100 కోట్లు! పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15 వేల నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు. మంత్రి తుమ్మల ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. Also Read : పార్టీకి పిలిచి దారుణానికి పాల్పడ్డ స్నేహితులు.. ఏం చేశారంటే? ఎకరాకు రూ. 10 వేల చొప్పున.. కాగా, గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున మెుత్తం ఎకరాకు రూ.10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది. ఎకరానికి రూ. 15 వేలు రెండు విడతల్లో జమ చేయనున్నారు. గతంలో ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని... ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇది వరకే ప్రకటించారు. విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికి రైతు భరోసా ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read : కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా జైలుకు.. రాజగోపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ #telangana #rythu-barosa #minister-tummala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి