Tattoo: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్!

టాటూ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సరదాకోసం పచ్చబొట్టు పొడిపించుకున్న 68 మంది మహిళలు ఎయిడ్స్ భారిన పడిన ఘటన యూపీ ఘజియాబాద్‌లో సంచలనం రేపింది. ప్రసవానికి వచ్చిన మహిళలకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. 

author-image
By srinivas
New Update
erer

Tattoo Aids : టాటూ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సరదాకోసం ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకున్న 68 మంది మహిళలు ఎయిడ్స్ భారిన పడటం సంచలనం రేపుతోంది. రోడ్‌సైడ్ వ్యక్తుల దగ్గర ఈ టాటూలు వేయించుకోవడం వల్లే ఇన్‌ఫెక్షన్స్ సోకి.. ఎయిడ్స్ బారిన పడ్డట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఒకరికి హెచ్‌ఐవి పరీక్షలు చేయించగా పాజిటివ్ రావడంతో మరింత మందికి టెస్టు చేయించారు అధికారులు. ఈ క్రమంలోనే భయంకరమైన విషయం బయటపడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read :  ఎమ్మెల్యేలకు గుడ్‌ న్యూస్‌..ఒక్కొక్కరికి రూ.50 కోట్లు!

రోడ్డు పక్కన టాటూలు వేయించుకున్నవారే.. 

యూపీ ఘజియాబాద్‌లోని మహిళా ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళలకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడ్డట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో 68 మంది మహిళలకు హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారించారు. వారందరికీ కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చినట్లు తెలిపారు. బాధితులంతా రోడ్డు పక్కన టాటూలు వేయించుకున్నవారేనని, టాటూ వేయించుకున్న తర్వాత వారి ఆరోగ్యం క్షీణించింద చెప్పారు. అయితే నిజమైన టాటూతో క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని, కానీ రోడ్డుమీద వేసేవారు ఒకే సూదితో చాలామందికి వేయడం వల్ల హెచ్ ఐవీ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. ఎయిడ్స్‌ బారిన పడిన వారిలో పురుషులు కూడా ఉన్నారని, వారందరికీ ఎయిడ్స్ సోకినట్లే భావిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో షాకింగ్ ఘటన.. వందలాది సీసీ కెమెరాల సీక్రెట్స్ లీక్ చేస్తూ..!

ఈ ఘటనపై జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 15 నుంచి 20 మంది మహిళలు ఎయిడ్స్ బారిన పడుతున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలందరికీ సురక్షిత ప్రసవం చేశామన్నారు. టాటూ కోసం కొత్త సూదులు వాడాలని, లేదంటే టాటూ వేసుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం 0.3 శాతం ఉంటుందని హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: Buffalo: దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా..

Also Read :  అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

Advertisment
Advertisment
తాజా కథనాలు