Pakistan: బలూచిస్తాన్‌లో భీకరమైన దాడి.. పాక్ సైనికులు 10 మంది మృతి

బలూచిస్తాన్‌లోని పంజ్‌గుర్, కలాట్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆకస్మిక దాడులు చేసింది. ఇందులో 10 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
BLA

BLA

పాకిస్తాన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. పంజ్‌గుర్, కలాట్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆకస్మిక దాడులు చేయగా 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడులు బలూచిస్తాన్‌లో వేర్పాటువాద గ్రూపుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Also Read :   నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్...వారికి రెడ్ సిగ్నల్‌

Balochistan Attack On Pakistan

ఈ క్రమంలోనే పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యంపై దాడులు జరుపుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును బలూచ్ లిబరేషన్ ఆర్మీ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ బలూచిస్తాన్ వనరులను దోచుకుంటుందని బీఎల్ఏ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లు, కార్మికులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. 

Also Read :  రష్యాకు బిగ్ షాక్.. ఆయిల్ రిఫైనరీని పేల్చేసిన ఉక్రెయిన్

ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీటీపీ దాడి

ఇటీవల పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్తాన్‌లో జరిగిన దాడిలో కూడా ఆరుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. వీరిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు. ఈ దాడిని తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు నిర్వహించింది. పాకిస్తాన్ తాలిబాన్‌గా కూడా పిలిచే TTP, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, TTP పాకిస్తాన్‌లో మరింత బలంగా మారింది. TTP పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ షరియా పాలనను స్థాపించడానికి పోరాడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వెంట ఈ గ్రూపు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల పాకిస్తాన్ సైన్యం TTP తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ గ్రూపు దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్ మరణించడం సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.

baloch army attack on pakistan | baloch army vs pak army | latest-telugu-news | telugu-news | international news in telugu | telugu crime news

Advertisment
తాజా కథనాలు