Nimisha Priya case : నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్...వారికి రెడ్ సిగ్నల్‌

కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. యెమెన్ వెళ్లాలని అనుకున్న సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌ బృందానికి భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. భద్రతాకారణాలతో అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

New Update
Nimisha Priya Death Penalty

Nimisha Priya Death Penalty Photograph: (Kerala nurse sentenced to death in Yemen)

Nimisha Priya case :కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. యెమెన్ వెళ్లాలని అనుకున్న సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌ బృందానికి భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. భద్రతాకారణాలతో పాటు ఆ దేశంతో సరైన సంబంధాలు లేని కారణంగా ఐదుగురు సభ్యులు గల ప్రతినిధుల బృందానికి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. నిమిష ప్రియ శిక్షను తగ్గించేందుకు సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌ బృందం మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తోంది.సుప్రీం కోర్టులోనూ పిటిషన్‌ కూడా వేసింది. అందులో భాగంగా ఆ బృందాన్ని యెమెన్‌ రాజధాని సనాకు వెళ్లడానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, కేంద్ర భద్రతా కారణాలు చెప్తూ అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా వెల్లడించింది.

‘‘యెమెన్ రాజధాని సనాలో పరిస్థితులు ఏమాత్రం బాలేవు. ఆ కారణాంగానే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం అంత మంచిదికాదు. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులు అక్కడి చర్చల్లో పాల్గొంటున్నారు. విదేశాంగ శాఖ తరఫున కూడా మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాము. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నప్పటికీ. మీరు అక్కడికి వెళ్లడానికి అనుమతించలేం’’ అని ఆ లేఖలో స్పష్టం చేసింది.

అయితే నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చాలాకాలంగా చెప్తూనే ఉంది. ఆమె శిక్షను తగ్గించడానికి తాము చేయాల్సిందంతా చేశామని,  మిగిలిన మార్గం బ్లడ్‌ మనీనే అని, అయితే అది ప్రైవేట్‌ వ్యవహారమని కేంద్రం ఇదివరకే సుప్రీం కోర్టుకు చెప్పింది. అది విన్న సుప్రీం ఇతర మార్గాలనైనా చూడాలంటూ కేంద్రానికి సూచించింది.ఈ చర్చలు ఇలా సాగుతుండగానే ఆమె మరణశిక్ష వాయిదా పడింది. తాజాగా విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారాన్ని బ్లడ్ మనీ అంటారు. హత్యకు గురైన కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

Also Read: ఐర్లాండ్‌లో భారత పౌరులపై దాడులు.. ఎంబసీ సంచలన ఆదేశాలు


కేరళకు చెందిన నిమిష ప్రియ యెమెన్ లో నర్స్ గా పనిచేసేది. భర్తతో కలిసి అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను నిర్వహించారు. అయితే వారి వ్యాపార భాగస్వామి అయిన తలాల్‌ అదిబ్‌ మెహదితో విబేధాలు వచ్చాయి. దీంతో అతను నిమిషకు చెందిన పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయంలో నిమిష పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. దీంతో మెహదికి మత్తుమందు ఇచ్చి వాటిని లాక్కోవలని అనుకుంది. కానీ అతను మరణించాడు.  ఈ కేసులో నిమిషకు మరణశిక్ష విధించారు. అయితే దాన్ని రద్దు చేయడానికి కేంద్రంతో పాటు పలువురు ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: రష్యా నుంచి చమురు దిగుమతిపై కేంద్రం క్లారిటీ.. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు