Redmi 14C 5G: సంక్రాంతి ఆఫర్.. రూ.10 వేలలోపే కిర్రాక్ 5జీ ఫోన్ విడుదల!

టెక్ బ్రాండ్ రెడ్‌మీ మరో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. రెడ్‌‌మి 14సీ 5జీని భారతదేశంలో విడుదల చేసింది. దీని బేస్ 4/64జీబీ వేరియంట్ రూ.9,999 ధరతో లభిస్తుంది. జనవరి 10 నుంచి సేల్ స్టార్ట్ కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా రెడ్‌మీ స్టోర్‌లో కొనుక్కోవచ్చు.

New Update
Redmi 14C 5G smartphone launched in india

Redmi 14C 5G smartphone first sale

భారతదేశంలో మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మీ తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను పరిచయం చేసింది. Redmi 14C 5Gని దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇంకా ఇది 120Hz రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌తో అమర్చబడింది. ఇంకా ఇందులో 5,160mAh బ్యాటరీని అమర్చారు. అలాగే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను అందించారు. 

ఇది కూడా చదవండి: BPSC పేపర్‌ లీక్‌ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు

Redmi 14C 5G Price

Redmi 14C 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. 

4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999
6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చాయి. 

ఇది కూడా చదవండి: 'బాహుబలి 2' ని రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే?

Redmi 14C 5G Sale

రెడ్‌మీ 14సీ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ Amazon, Flipkart, Mi.comతో పాటు Xiaomi రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు. జనవరి 10న మధ్యాహ్నం 12:00 గంటలకు దీని ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. 

Redmi 14C 5G Specifications

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ (720x1640 పిక్సెల్‌లు) LCDని కలిగి ఉంది. డిస్ ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుంది. అలాగే ఇది 4nm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoCని కలిగి ఉంది. ఈ ఫోన్ HyperOS స్కిన్‌తో Android 14 పై నడుస్తుంది. 

ఇది కూడా చూడండి: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఫోటోలు, వీడియోల కోసం Redmi 14C 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌లో కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, GPS, గ్లోనాస్, గెలీలియో, బీడౌ, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇక దీని బ్యాటరీ విషయానికొస్తే.. Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్ 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఫోన్ బాక్స్‌లో రూ.1,999 విలువైన 33W ఇన్‌బాక్స్ ఛార్జర్‌ను అందించనున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు