Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే!

కెనడా ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిబరల్‌ పార్టీ నాయకత్వానికి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. మరో 90 రోజుల్లో కొత్త నాయకత్వం ఎన్నికవగానే తాను బాధ్యతల నుంచి పూర్తి తప్పుకుంటానని ప్రకటించారు.

New Update
justin trudeau

Canadian Prime Minister Justin Trudeau resign

Justin Trudeau: కెనడా ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిబరల్‌ పార్టీ నాయకత్వానికి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. మరో 90 రోజుల్లో కొత్త నాయకత్వం ఎన్నికవగానే తాను బాధ్యతల నుంచి పూర్తి తప్పుకుంటానని ప్రకటించారు. సొంత పార్టీ నేతల డిమాండ్స్ మేరకు ట్రూడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ట్రూడో వైదొలగాలంటూ డిమాండ్..

ఈ మేరకు తన రాజీనామా గురించి సోషల్ మీడియాలో కూడా ప్రకటించిన ట్రూడో.. ‘పార్టీ నాయకత్వం, ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని పార్టీకి, గవర్నర్‌కు చెప్పేశాను. కొత్త నాయకత్వం ఏర్పడగానే వెంటనే రాజీనామా చేస్తా. మార్చి 24వరకు పార్లమెంటును ప్రొరోగ్‌ చేస్తున్నా’ అంటూ జస్టిన్ స్పష్టం చేశారు. ఇక సొంత పార్టీ నేతలే ట్రూడో వైదొలగాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీంతో ట్రూడో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Telangana: కారులో ఇద్దరు సజీవ దహనం కేసులో కీలక ట్విస్ట్..

ఆర్థికశాఖ మంత్రి రిజైన్..

ఇక దశాబ్ద కాలం పాటు ప్రధానిగా ఉన్న ట్రూడో.. ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవడంపై ప్రపంచ దేశాధినేతలు ఆశ్చర్యపోతున్నారు. ఇక  కెనడా చట్టప్రకారం అధికార పార్టీ నాయకుడు రాజీనామా చేసిన 90 రోజుల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఇదిలా ఉంటే.. ఇటీవలే కెనడా ఉప ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ రిజైన్ చేశారు. జస్టిన్‌ ట్రూడో కేబినెట్‌లో క్రిస్టియా అత్యంత శక్తివంతమైన మంత్రిగా పేరు పొందారు. 

ఇది కూడా చదవండి: Rat Hole: 18 మందిని మింగిన 'ర్యాట్ హోల్'.. 300 అడుగుల లోతులో!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు