Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే?

దక్షిణ మధ్యరైల్వే మరికొన్ని ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య 6ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జనవరి 11,12, 15,16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం మధ్య, జనవరి 8,9 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రైళ్లు నడవనున్నాయి.

New Update
Special Trains

Special Trains

దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ తెలిపింది. మరికొన్ని స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. కాచిగూడ - శ్రీకాకుళం, చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య దాదాపు 6 స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. 

కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య - జనవరి 11, 12, 15, 16 తేదీల్లో రాకపోకలు జరగనున్నాయి. 

అలాగే చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య - జనవరి 8, 9 తేదీల్లో రెండు స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.

Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

కాచిగూడ -  శ్రీకాకుళం రోడ్ మధ్య

కాచిగూడ -  శ్రీకాకుళం రోడ్ మధ్య (07615) ట్రైన్ జనవరి 11, 15 తేదీల్లో నడవనుంది. 
కాచిగూడలో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. 

Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ మధ్య

అలాగే శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ మధ్య జనవరి 12, 16 తేదీల్లో నడవనుంది. 
శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 7.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అయితే ఈ రైలులో అన్నీ థర్డ్‌ ఏసీ కోచ్‌లే ఉండటం గమనార్హం. 

ఈ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. 

Also Read : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!

spl train
spl train

 

చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య

చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య (07617) ట్రైన్ జనవరి 8న నడవనుంది. 
చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకోనుంది. 

శ్రీకాకుళం - చర్లపల్లి మధ్య

Also Read : ఆ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

శ్రీకాకుళం - చర్లపల్లి మధ్య (07618) ట్రైన్ జనవరి 9న నడవనుంది. 
శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. ఈ రైలులో ఫస్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయి. 

ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు