/rtv/media/media_files/2025/08/13/uk-asks-people-to-clear-their-inboxes-to-save-water-2025-08-13-16-12-55.jpg)
UK Asks People To Clear Their Inboxes To Save Water
యూకే(UK) లో ప్రస్తుతం నీటి సంక్షోభం(water-crisis) నెలకొంది. నీరు దొరకక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇన్‌బాక్స్‌లో తమ పాత ఈ మెయిల్స్ డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో అందరూ ఈ పనిచేయాలని కోరింది. అదేంటి నీరు లేకుంటే పాత ఈమెయిల్స్ డిలీట్ చేయించడం ఏంటని అనుకుంటున్నారా ?. ఇక్కడే అసలు సమస్య ఉంది. వాస్తవానికి పాత ఈమెయిల్స్, ఫొటోలను భద్రపరిచేందుకు క్లౌడ్ సిస్టమ్‌ను వాడుతారు. ఇందుకోసం భారీగా డేటా సెంటర్లు అవసరం అవుతాయి. ఆ కేంద్రాల్లో ఉండే సిస్టమ్స్‌ను చల్లబర్చేందుకు భారీ మొత్తంలో నీరు కావాలి.
Also Read: ఓట్ల చోరీ వివాదం.. సోనియాగాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు
Water Crisis In UK
ప్రస్తుతం యూకేలో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పనికిరాని డేటాను డిలీట్ చేయాలని కోరుతోంది. అయితే భారీ డేటా సెంటర్లు ఒక్కరోజుకు ఏకంగా 50 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తాయి. ఆ నీరు 10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న పట్టణానికి ఆరోజు సరిపోతుంది. అందుకే నీటిని ఆదా చేసేందుకు బ్రిటన్ సర్కార్ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బ్రిటన్‌లో నాలుగో హీట్‌వేవ్ ఉంది. అక్కడ ఐదు ప్రదేశాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఆరు ప్రదేశాల్లో పొడి వాతావరణం ఉంది. నీటిని పోదుపు చేసేందుకు కరవు ఎదుర్కొంటున్న ప్రదేశాల్లోని ప్రజలు.. కొన్ని రూల్స్ పాటించాలని ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీలో డైరెక్టర్ ఆఫ్ వాటర్‌గా ఉన్న హెలెన్ సూచనలు చేశారు. ''ప్రజలు తమ గార్డెన్‌కు నీటిని వాడుకునేందుకు వర్షపు నీటిని సేకరించే రెయిన్ బట్‌లు ఏర్పాటు చేసుకోవాలి. వాష్‌రూమ్‌లలో లీకేజీలను సరిచేయండి. దీనివల్ల రోజుకు 200 నుంచి 400 లీటర్ల నీటిని పొదుపు చేయొచ్చు.
Also Read: రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
వంటగదిలో వాడిన నీటిని మొక్కలను పెంచేందుకు వాడాలి. లాన్‌లో నీటి వాడకాన్ని తగ్గించాలి. బ్రష్ చేసుకునే సమయంలో, షేవింగ్ చేసుకునే సమయంలో ట్యాప్ వాటర్‌ను ఆపేయాలి. షవర్ కింద తక్కువ సేపు స్నానం చేయండి. పాత ఈమెయిల్స్, ఫొటోలను డిలీట్ చేయండని'' హెలెన్ సూచనలు చేశారు. ప్రస్తుతం యూకేలోని యార్క్‌షైర్, కుంబ్రియా అండ్ లాంక్షైర్, గ్రేటర్ మాంచెస్టర్, మెర్సీసైడ్ అండ్ చెషైర్, ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్ అండ్ వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో కరువు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
Good news everyone.
— Zia Yusuf (@ZiaYusufUK) August 12, 2025
The government’s ‘National Drought Group” met and have instructed us all to save water by…
deleting your old emails.
Your taxpayer money is paying for this.
Britain is being run by morons.https://t.co/y0XZnGopWIpic.twitter.com/hob3u5gdR5
rtv-news | telugu-news | international news in telugu | latest-telugu-news