BAPS Temple: రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

అమెరికాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్‌ కౌంటీలో అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్‌ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్‌ ఎక్స్‌లో వెల్లడించింది.

New Update
BAPS Temple

BAPS Temple

అమెరికాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు.  ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్‌ కౌంటీలో అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్‌ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్‌ ఎక్స్‌లో వెల్లడించింది. ఖలిస్థానీకి సపోర్ట్‌గా, భారత్‌కు వ్యతిరేకంగా ఆలయంపై పలు విద్వేషపూరిత స్లోగన్‌లు రాశారని పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి విధ్వంసాలను తాము ఖండిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: ధర్మస్థల కేసులో సంచలన అప్‌డేట్.. 13వ స్పాట్‌లో 8 మృతదేహలు

BAPS Temple In Indiana Vandalized

Also Read: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..

అమెరికాలో ఈ ఏడాది హిందూ దేవాలయాలపై దాడులు చేయడం ఇది నాలుగోసారని నిర్వహకులు చెబుతున్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఆలయం దగ్గర భారీ భద్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా గతేడాది మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలో ఐకానిక్ ఆలయంపై ఇలాంటి దాడే జరిగింది. ఆ ఆలయంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా రాతలు రాశారు. దీన్ని భారత ప్రభుత్వం(Indian Government) తీవ్రంగా ఖండించింది. ఇది నీచమైన చర్యగా పేర్కొంది. 

Also Read: ముందు చైనా..తరువాత అమెరికా ..టారీఫ్ లపై పక్కా ప్లాన్ తో భారత ప్రధాని మోదీ

2023 సెప్టెంబర్‌లో కూడా న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలో BAPS ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజులకే సాక్రమెంటో దగ్గర్లోని మరో ఆలయంపై దాడి జరిగింది. అదే డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని న్యావార్క్ BAPS ఆలయంపై కూడా దాడులకు పాల్పడ్డారు.  

hindu temple attack | rtv-news | telugu-news | latest-telugu-news | international news in telugu

Advertisment
తాజా కథనాలు