Russia, Ukraine war: ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై UNOలో రెండు తీర్మాణాలు.. భారత్ ఎవరివైపంటే..?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడెళ్లు కావస్తున్న సందర్భంగా UNOలో 2 తీర్మానాలు పెట్టారు. రష్యా దండయాత్రను ఖండిస్తూ కీవ్, ఐరోపా దేశాలు సాధారణ సభలో ఓ తీర్మానం తీసుకొచ్చాయి. యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొనేలా అమెరికా మరో తీర్మానాన్ని ప్రతిపాదించింది.

New Update
UNO meeting

UNO meeting Photograph: (UNO meeting)

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై మూడేళ్లు అవుతోంది. ఇకనైనా పరస్పర దాడుల ఆపి శాంతి చర్చలకు రావాలని ఐక్యరాజ్య సమితి సోమవారం ఓ ప్రయత్నం చేసింది. అదే సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఫిబ్రవరి 24న రెండు తీర్మానాలను ప్రవేశపెట్టారు. రష్యా దండయాత్రను ఖండిస్తూ.. ఉక్రెయిన్‌ నుంచి మాస్కో సేనలు వెంటనే వైదొలగాలని కోరుతూ కీవ్, ఐరోపా దేశాలు సాధారణ సభలో ఓ తీర్మానం తీసుకొచ్చాయి. దీనిపై ఓటింగ్ నిర్వహించగా రష్యా, ఉత్తర కొరియా, బెలారస్‌లతో కలిసి అమెరికా వ్యతిరేకంగా ఓటువేసింది.

Also Read : షటిల్ కోర్ట్‌లోనే కుప్పకూలిన ప్లేయర్ (VIDEO VIRAL)

అమెరికా 14 మిత్ర దేశాలు కూడా వ్యతిరేకంగానే ఓటు వేశాయి. భారత్ మాత్రం ఈ తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. ముందు నుంచి ఐరాసలో ఉక్రెయిన్, రష్యా తీర్మానాలపై భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా అలాగే వ్యవహరించింది.

Also Read : Trump: ఆయనేమి నియంత కాదు అంటున్న ట్రంప్‌!

యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టానికి సంతాపం వ్యక్తంచేస్తూ, తక్షణమే యుద్ధాన్ని ఆపేసి శాంతి నెలకొనేలా చూడాలని అమెరికా మరో తీర్మానాన్ని ప్రతిపాదించింది. వ్యతిరేకంగా 93 దేశాలు ఓటువేయగా.. భారత్ సహా 65 దేశాలు ఓటింగ్‌‌కు దూరంగా ఉన్నాయి. అయితే, సాధారణ సభలో వీగిపోయిన ఈ తీర్మాన్ని భద్రతా మండలి మాత్రం ఆమోదించింది. అమెరికా తీర్మానంపై రష్యా ప్రతినిధి వసిలే నెబంజియా మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరిలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఈ తీర్మానం ఆదర్శవంతమైనది కాదు కానీ శాంతియుత పరిష్కారం వైపు భవిష్యత్తు ప్రయత్నాలకు ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు