Trump: ఆయనేమి నియంత కాదు అంటున్న ట్రంప్‌!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు.

New Update
trump putin

trump putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు. ట్రంప్‌ తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Also Read: Telangana: తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా!

పుతిన్‌ ను నియంతగా భావిస్తున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు.దీనికి ట్రంప్‌ బదులిస్తూ..నేను సాధారణంగా అలాంటి పదాలు ఉపయోగించను.ఇది ఎలా ముందుకుసాగుతుందో చూడాలి అని పేర్కొన్నారు.అయితే ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని ట్రంప్‌ నియంతగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.

Also Read:  Trump: మస్క్‌ కు రిప్లై ఇవ్వకపోతే ఉద్యోగుల పై వేటు తప్పదు!

ఇదిలా ఉండగా..జెలెన్‌ స్కీతో తాను త్వరలోనే భేటీ అవుతానని ట్రంప్‌ తెలిపారు. కీవ్‌ లోని విలువైన ఖనిజ వనరులకు సంబంధించిన ఒప్పందాల పై సంతకం చేసుకునేందుకు జెలెన్‌ స్కీ విలువైన ఖనిజ వనరులకు సంబంధించిన ఒప్పందాల పై సంతకం చేసుకునేందుకు జెలెన్‌ స్కీ త్వరలోనే అగ్రరాజ్యానికి రానున్నట్లు ఆయన వెల్లడించారు.

మూడో ప్రపంచ యుద్ధం...

ఆ సందర్భంగా తెలివిగా వ్యవహరిస్తే రష్యా-ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం వారాల్లోనే ముగిసిపోతుందని, లేకుంటే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చన్నారు. యుద్దంలో భాగంగా రష్యా ఆక్రమించిన భూభాగం తిరిగి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని ట్రంప్‌ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరో వైపు శాంతి నెలకొల్పడం అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదని మేక్రాన్‌ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

రష్యా ఉక్రెయిన్‌ ల మధ్య శాంతి నెలకొల్పడం అంటే కీవ్‌ లొంగిపోవడం అని అర్థం కాదు.హామీలు లేని కాల్పుల విరమణ,శాంతిని నెలకొల్పడంలో అమెరికా ప్రమేయం అవసరం అని ఆయన తెలిపారు. ఇక రష్యా-ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం నెలకొని సరిగ్గా మూడేళ్లయ్యింది.ఈ నేపథ్యంలో ఇరు వైపులా లక్షలాది మంది సైనికులు మరణించడం , గాయపడ్డారు.

 కోట్ల డాలర్ల మేర ఆస్తినష్టం వాటిల్లింది. అయితే తాను యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్‌ పేర్కొటూ వచ్చారు. అందులో భాగంగా ఇరు దేశాధినేతలు శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. 

Also Read:  Virat Kohli: అదే నా వీక్ నెస్‌ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు!

Also Read: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్‌!

Advertisment
తాజా కథనాలు