/rtv/media/media_files/2025/05/22/Omint2T6y4QfkbHSRrdO.jpg)
Two Israeli embassy staffers killed outside Washington event
అమెరికాలో తాజాగా మరోసారి ఉగ్రదాడి జరగడం కలకలం రేపింది. రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై తీవ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపిన వివరాల ప్రకారం కేపటిల్ జెనిష్ మ్యూజియం దగ్గర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Also Read: జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదంటున్న పోలీసులు
మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన తీవ్రవాదులు వాళ్లని కాల్చి చంపేశారు. మృతుల్లో ఓ మహిళా ఉద్యోగి కూడా ఉన్నారు. కాల్పుల జరిగిన తర్వాత ఆ ఉగ్రవాదులు 'ఫ్రీ పాలస్తీనా' అంటూ నినాదాలు చేశారు.
Also Read: ప్రకృతిని నాశనం చేస్తున్నారు కదరా.. 44 వేల ఎకరాల అడవులను కోల్పోయిన భారత్..
అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ యూఎస్ రాయబారి డానీ డానన్ ఖండించారు. కాల్పులకు పాల్పడ్డవాళ్లపై అమెరికా అధికారులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తాము భావిస్తున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఉండే వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి ప్రాంతంలో తాజాగా ఉగ్రదాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు\
Also Read: ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు..
telugu-news | usa | israel | Terrorist Attack