/rtv/media/media_files/2025/07/20/7-policemen-go-missing-during-patrolling-in-pakistan-2025-07-20-16-43-09.jpg)
7 policemen go missing during patrolling in Pakistan's Khyber Pakhtunkhwa
పాకిస్థాన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసులు అదృశ్యమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పాక్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోని సౌత్ వాజిరిస్థాన్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో పోలీసులు కనిపించకుండా పోయినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. వీళ్లలో ముగ్గురు లద్దా పోలీస్ స్టేషన్‌కు చెందినవారు.
Also Read: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్
మరో నలుగురు సర్వాకై పోలీస్ స్టేషన్ పరిధిలో టాంగా చాగ్మాలి ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఈ ఏడుగురిలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. వీళ్లందరూ కూడా పెట్రోలింగ్ చేస్తున్న సమయంలోనే అదృశ్యమైనట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వాళ్లకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కానీ ఇప్పటిదాకా వాళ్ల ఆచూకికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.
Also Read: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
ఇదిలాఉండగా.. పాక్ ప్రభుత్వంతో 2022 నవంబర్‌లో నిషేధిత తెహ్రీక్ -ఇ- తాలిబన్ పాకిస్థాన్ (TTP) కాల్పుల విరమణ ముగిసింది. ఆ తర్వాత అప్పటినుంచి పాకిస్థాన్‌లో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ దాడులు మరింతగా పెరిగాయి.