/rtv/media/media_files/2025/08/09/trump-tariffs-leading-to-isolate-america-2025-08-09-15-43-42.jpg)
Trump's tariffs leading to isolate america, Experts Warning
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ టారిఫ్‌ల వల్ల అమెరికా ఏకాకి అయిపోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ కూటమి దేశాల ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాలు ఉన్నాయి. ఇటీవల ఇరాన్, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా వంటి మరిన్ని దేశాలు కూడా చేరాయి. మొత్తం పది దేశాలు ఉన్న ఈ కూటమి ప్రపంచ వాణిజ్యంలో బలమైన శక్తిగా అవతరిస్తోంది.
Also Read: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని ఆస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!
ట్రంప్ టారిఫ్‌లు, ఆర్థిక ఆంక్షలతో డాలర్‌ను ఒక రాజకీయ సాధనంగా వాడుతున్నారనే భావన BRICS దేశాల్లో బలపడింది. అందుకే దీనికి ప్రతీగా.. ఈ దేశాలు తమ సొంత కరెన్సీలలో వాణిజ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దేశాలన్ని ఏకం కావడంతో అమెరికా ఏకాకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు అమెరికా ఏకాధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ విధానాల వల్ల ఓ బుహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థను స్థాపించేందుకు యత్నిస్తున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
అమెరికా కంట్రోల్‌లో ఉండే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థలకు ప్రత్యామ్నాయంగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకును స్థాపించాయి. ఈ బ్యాంక్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎలాంటి షరతులు లేకుండానే రుణాలు ఇస్తోంది. ఇది డాలర్ అధిపత్యాన్ని తగ్గిస్తోన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బ్రిక్స్ దేశాలు తమ వాణిజ్యాన్ని, పెట్టుబడులు పెంచుకునేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. అన్ని కూడా ప్రపంచ వేదికపై కలిసి పనిచేస్తున్నాయి.
Also Read: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా టారిఫ్‌లకు వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు ప్రతీకార సుంకాలు విధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల అమెరికా ప్రపంచ వాణిజ్య వేదికపై ఒంటరిగా మారనుందని.. బ్రిక్స్ కూటమి మరింత బలపడే ఛాన్స్ ఉందని నిపుణులు అంచానా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌ల యుద్ధం అమెరికాకు ఆశించినంత ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చని కూడా చెబుతున్నారు. బ్రిక్స్ దేశాల్లో కీలకమైన భారత్, రష్యా, చైనా, సౌతాఫ్రికా దేశాలు ఇప్పటికే ట్రంప్ తీరుపై తీవ్రంగా విసిగిపోయాయి. అలాగే ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో అమెరికాకు వ్యతిరేకంగా ఏదైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో చైనా, రష్యా, భారత్, పాకస్థాన్ తదితర దేశాలున్నాయి.
ట్రంప్ వైఖరిపై అమెరికాలోనే తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆయన అతి చెత్త నిర్ణయాలు తీసుకొంటున్నారని యూఎస్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే మండిపడ్డారు. ఆయన నిర్మిస్తున్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తప్పని అన్నారు. ట్రంప్ మిగతా ప్రపంచంపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి తనను తాను నాశనం చేసుకుంటున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.
Also Read: రష్యాతో చర్చల తర్వాత అదనపు సుంకాలుండవు..పాకిస్తాన్ ఆశాభావం