Trump Tariffs On India: రష్యాతో చర్చల తర్వాత అదనపు సుంకాలుండవు..పాకిస్తాన్ ఆశాభావం

రష్యాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల తర్వాత భారత మీద అదనపు సుంకాలు తీసేస్తారని పాకిస్తాన్ నిపుణుడు ముక్తదర్ ఖాన్ చెబుతున్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ నిర్ణయం వస్తుందని ఆయన అన్నారు. 

New Update
putin

Trump Tariffs On India

Trump Tariffs On India: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఆర్థిక నిపుణుడు ముక్తదర్ ఖాన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో..ట్రంప్ భేటీ తర్వాత భారత్ పై అదనపు సుంకాలను క్యాన్సిల్ చేస్తారని అన్నారు. వాణిజ్యానికి సంబంధించి అమెరికాతో ఇండియా ఇంకా చర్చలు చేస్తోంది కాబట్టి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని భావించొద్దని ఆయన అన్నారు. ఆగస్టు 27 కన్నా ముందే పుతిన్, ట్రంప్ చర్చలు జరుగుతాయని...ఆ తర్వాత రష్యా కాల్పులు విరమణ ప్రకటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పుతిన్ ను అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ వెట్ కాఫ్ కలిశారని...అక్కడ ఆ రెండు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయని చెప్పారు. అయితే మరో రెండు, మూడు చిన్న విషయాలు ఇంకా చర్చలు చేయాల్సి ఉన్నాయని...అవి ఇరు దేశాధ్యక్షుల భేటీ తర్వాత సాల్వ్ అయిపోతాయని ముక్తదర్ తెలిపారు.

ఏం ఉపయోగం లేదు..

భారత్ పై అదనపు సుంకాలు విధించడం వలన అమెరికాకు ఎటువంటి ఉపయోగం లేదని పాకిస్తాన్ నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దారుణ స్థితిలో ఉందని... వారు కూడా ఖర్చులు తగ్గించుకునేందుకు రష్యా నుంచే చమురు కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రష్యా, అమెరికాలు సరైన నిర్ణయం తీసుకుంటాయని ముక్తదర్ అన్నారు. అదనపు సుంకాలు ఉండకపోవచ్చని చెప్పారు. 

ఆగస్టు 15ను పుతిన్, ట్రంప్ భేటీ..

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 15న అలస్కాలో భేటీ కానున్నారు.ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. పుతిన్‌తో భేటీకి ముందు ట్రంప్.. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో మాట్లాడనున్నారు.  ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్, పుతిన్, భారత ప్రధాని  మోదీల మధ్య ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. రష్యాతో వ్యాపారం వద్దని ట్రంప్ పట్టుబడుతుంటే..ఏ మాత్రం తగ్గేదే లేదని పుతిన్, మోదీ అంటున్నారు.

ఈ నేపథ్యంలో భారత స్వాతంత్రదినోత్సవం రోజునే రష్యా, అమెరికా అధ్యక్షులు భేటీ అవడం కీలక పరిణామంగా మారింది. ఈ చర్చలు రష్యా ఉక్రెయిన్ పై కాల్పుల విరమణ కోసం సాగనున్నాయని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య భూభాగాలను మార్చుకోవడం ద్వారా ఈ యుద్ధాన్ని ఆపొచ్చని ట్రంప్ ఆలోచన. అంటే, రెండు దేశాలూ కొంత భూమిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే, శాంతి సాధ్యమవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. మరి దీనికి రష్యా ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికే మూడుసార్లు శాంతి ఒప్పందం చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు రష్యా కనుక ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే..అదనపు సుంకాలపై ట్రంప్ మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రపంచ దేశాలు అంటున్నాయి. దాని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. 

Also Read: Trump Tariffs:తన గోతిని తానే తవ్వుకుంటున్నారు..సొంతదేశంలోనే ట్రంప్ పై వ్యతిరేకత 

Advertisment
తాజా కథనాలు