అనేక దేశాలపై టారిఫ్‌ల భారం మోపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడును ఇంకా కొనసాగిస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికా కంపెనీలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు అమెరికా పౌరులకే ఉద్యోగాలు కల్పించే అవకాశాలివ్వని.. విదేశీయుల సృజనాత్మకతపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. ఇటీవల వాషింగ్టన్‌లో నిర్వహించిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడారు.
Also Read: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని ఆస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!
అంతేకాదు అమెరికా కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శలు చేశారు. అమెరికన్ వ్యవస్థల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ విదేశాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం టెక్ రంగంలో వలసలు, ఉపాధిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: రష్యాతో చర్చల తర్వాత అదనపు సుంకాలుండవు..పాకిస్తాన్ ఆశాభావం
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. భారతీయ నిపుణులు అమెరికాలో పనిచేయాలంటే హెచ్1 బీ వీసా అవసరం. కానీ ట్రంప్ వచ్చినప్పటికీ చాలావరకు ఈ వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. అంతేకాదు అక్కడ పనిచేస్తున్న వాళ్లలో వీసా పొడిగింపులను కూడా తిరస్కరించారు. వీలైనంత వరకు అమెరికన్లకే ఉద్యోగాలు ఇప్పించేలా ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ వేతనాల కోసం వీదేశీ ఉద్యోగులను నియమించుకునే పద్ధతిని కూడా ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. ఏకాకి అవుతున్న అమెరికా
మరోవైపు ప్రతీకార సుంకాలు వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. టారీఫ్‌ల సానుకూల ప్రభావంతో యూఎస్ దేశ ఖజానాకు వందల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోందని చెప్పారు. ఎప్పుడూ లేనట్లుగా అమెరికా ఆర్థికంగా ఎదుగుతోందన్నారు ఇలాంటి సమయంలో టారీఫ్ లను అడ్డుకుంటే.. సంపద సృష్టి ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడి చాలా నష్టం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల అమెరికా 1929 తరహా డిప్రెషన్ లో కూరుకుపోతుందని హెచ్చరించారు.