/rtv/media/media_files/2025/08/09/trump-tariffs-2025-08-09-09-52-20.jpg)
Opposition On Trump Tariffs
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతి చెత్త నిర్ణయాలు తీసుకొంటున్నారని యూఎస్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిర్మిస్తున్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తప్పు అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిగతా ప్రపంచంపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా తనను తాను నాశనం చేసుకుంటున్నారని స్టీవ్ అన్నారు. భారత వస్తువులపై సుంకాన్ని 50 శాతానికి పెంచడాన్ని ఆయన పూర్తిగా తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాలపై భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విషయంలో కొంత వెయిట్ చేయాలని ఆయన కోరారు.
అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బాలేకపోవడానికి కారణం అమెరికన్లు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు...అందుకే ఇక్కడ భారీ వాణిజ్య లోటు ఉందని ప్రొఫెసర్ హాంకే చెబుతున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ట్రంప్ పాటిస్తున్న ఆర్థికశాస్త్రం పూర్తిగా చెత్త అని అని ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
సొంత దేశంలో ట్రంప్ పై ఎక్కువవుతున్న వ్యతిరేకత..
స్టీవ్ హాంకే ఒక్కరే కాదు ట్రంప్ నిర్ణయాలపై యూఎస్ లో చాలా మందే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలో నేతలు సైతం భారత్ పై అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఇండియా లాంటి మిత్రదేశంతో తగవు పెట్టుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అయినా కూడా ట్రంప్ ఎవరి మాటా వినడం లేదు. ఇదే మాటను అమెరికా మాజీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ కాంప్ బెల్ కూడా అంటున్నారు. భారతదేశంపై ట్రంప్ సుంకాలను విమర్శించారు. సుంకాల కారణంగా అమెరికా-భారత్ సంబంధాలు ఇప్పుడు ముప్పులో ఉన్నాయని ఆయన అన్నారు. 21వ శతాబ్దంలో అమెరికాకు అతి ముఖ్యమైన సంబంధం భారత్ తో ఉంది. అది ఇప్పుడు ప్రమాదంలో ఉందని కాంప్ బెల్ వ్యాఖ్యానించారు. ఇదొక్కటే కాదు ఆయన భారత్ కే మద్దతు పలికారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత ప్రధాని మోదీ..ట్రంప్ ముందు మోకరిల్లకూడదని ఆయన సలహా ఇచ్చారు. రష్యాతో తన సంబంధాల గురించి అమెరికా భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. ఇది ఎక్కువ అయితే వారు అమెరికాకు పూర్తిగా వ్యతిరేకం అవుతుందని క్యాంప్ బెల్ భయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి అని మర్చిపోవద్దని హెచ్చరించారు.
Also Read: Big Breaking: జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి