UAE: మేమేం గోల్డెన్ వీసా ఇవ్వడం లేదు..ఫేక్ న్యూస్ నమ్మకండి అంటున్న యూఏఈ

రూ.23 లక్షలకే  గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. ఈ వీసాను పొందాలంటే ప్రభుత్వ విధానాల ద్వారానే దరఖాస్తులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. 

New Update
UAE

UAE Golden Visa

అతి తక్కువ ధరకే యూఏఈ శాశ్వత నివాసం...గోల్డెన్ వీసా కార్డ్ అంటూ రెండు రోజుల క్రితం ఒక వార్త తీవ్రంగా ప్రచారం అయింది. కేవలం రూ.23 లక్షలు కడితే చాలు ఈ వీసా వచ్చేస్తుందని న్యూస్ ప్రసారం అయింది. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది అబుదాబి ఐసీపీ (ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటింటీ, సిటిజన్‌షిప్‌, కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ). దీనికి సంబంధించి ఎమిరేట్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన నను కూడా షేర్ చేసింది. రూ.23 లక్షలకే  గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫే్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. ఈ వీసాను పొందాలంటే ప్రభుత్వ విధానాల ద్వారానే దరఖాస్తులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. 

Also Read :  గురు పూర్ణిమ ఈరోజే.. ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే మీ కష్టాలన్నీ మాయం!

Also Read :  యెమెన్ నర్స్ నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నం..బ్లడ్ మనీ ఒక్కటే దారి

తప్పుడు ప్రచారం నమ్మొద్దు..

ఎవరో ప్రజలను మోసం చేయడానికే ఇలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని..వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఐపీసీ హెచ్చరించింది. వీసా సమాచారం కోసం తప్పుడు, మోసపూరిత మాటల్లో పడొద్దని.. అధికారిక మార్గాల్లోనే తెలుసుకోవాలని సూచించింది. ఇందుకోసం www.icp.gov.ae లేదా ఫోన్‌ నెంబర్‌ : 600522222 సంప్రదించాలని పేర్కొంది.  అయితే ఈ గోల్డెన్ వీసా అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు చెబుతున్నట్టుగా అది కేవలం రూ.23 లక్షలకు మాత్రం రాదని ఐపీసీ స్పష్టం చేసింది. 

Also Read :  తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

నామినేషన్ ఆధారిత వీసాలో మాత్రం కేవలం లక్ష ఈఏడీ అంటే రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవిత కాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసాలు పొందవచ్చను అంటూ ఈ వారం మొదట్లో న్యూస్ వచ్చింది. ఈ గోల్డెన్ వీసా కోసం తమ దేశం నుంచే అప్లై చేసుకోవచ్చును. రియాద్ రిజిస్టర్డ్ కార్యాలయాలు, ఆన్‌లైన్‌ పోర్టల్‌, వన్‌వాస్కో కేంద్రాలు, ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చును. ఈ వీసా వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులనూ దుబాయ్ తీసుకురావచ్చును. సహాయకులను, డ్రైవర్లను పెట్టుకోవచ్చును. దుబాయ్ లోనే ఏదైనా ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చును ఈ గోల్డెన వీసా జీవిత కాలం చెల్లుబాటు అవుతుంది. భారత్, బంగ్లాదేశ్ తరువాత దీనిని మిగతా దేశాలకూ విస్తరించనున్నారు. 

Also Read :  ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..

UAE Golden Visa | Golden Visa | uae | today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు