/rtv/media/media_files/2025/07/28/trump-vs-putin-2025-07-28-21-45-29.jpg)
Trump VS Putin
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పంద చర్చలు జరుగుతున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చాలాసార్లు చెప్పారు. కానీ పుతిన్ తీరులో మార్పు లేదు. దీంతో ఇటీవల 50 రోజుల్లో శాంతి ఒప్పందం చేసుకోవాలని గడువు ఇచ్చారు. అయితే తాజాగా ట్రంప్ మరో సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఆ గడువును 12 రోజుల డెడ్‌లైన్‌గా విధిస్తున్నట్లు వెల్లడించారు. 10 లేదా 12 రోజుల్లో కాల్పుల విరమణకు రావాలని అన్నారు.
Also Read: దేశంలో అత్యంత పేద వ్యక్తి ఈయనే.. ఆదాయం 'సున్నా'
'' పుతిన్ చర్యలపై నిరాశ చెందాను. ఆయన బాగా మాట్లాడతారు. కానీ రాత్రికి మాత్రం జనాలపై బాంబులతో దాడులు చేస్తారు. ఇంతకుముందు శాంతి ఒప్పందానికి రావాలని 50 రోజులు గడువు ఇచ్చాను. ఇప్పడు దాన్ని కుదిస్తున్నాను. రాబోయే 10 లేదా 12 రోజుల్లో పుతిన్ రాజీకీ రావాలి. లేదంటే సెకండరీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని'' ట్రంప్ చెప్పినట్లు బీబీసీ పేర్కొంది.
Also Read: కువైట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ.. ఇండియాకు పంపించకుండా హింసిస్తున్న యజమాని
ఇదిలాఉండగా ట్రంప్ ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షడుని అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. జెలెన్‌స్కీ వెనక్కి తగ్గాలని అనుకుంటున్నప్పటికీ పుతిన్ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే రష్యాపై పశ్చిమాసియా దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అయితే మరో 10, 12 రోజుల్లో రాజీకి రాకుంటే సెకండరీ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ రష్యాను హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.