చాలామంది బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపిస్తారు. ఎంత కష్టమైనా ఓర్చుకొని కన్నీళ్లు దిగమింగుకొని పనిచేస్తుంటారు. మరికొందరికి మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. పని ఇచ్చిన యజమానులు చిత్ర హింసలు పెడుతుంటారు. ఇండియాకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకుంటారు. ఈ మధ్యకాలంలో పలువురు ఇలా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని తమ బాధలు సోషల్ మీడియాలో చెప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఉండే పెద్దలు కేంద్రం సాయంతో వాళ్లని భారత్‌కు తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
Also Read: మిట్టమధ్యాహ్నం రెచ్చిపోయిన అంకుల్.. ఆంటీతో బైకుపై బంచిక్బంచిక్
అయితే తాజాగా మరో మహిళకు ఇలాంటి కష్టమే ఎదురైంది. ఏపీలోని ఏలూరు జిల్లా బయ్యన్నగూడెంకి చెందిన సుమ అనే మహిళ కువైట్‌లో చిక్కుకుంది. 3 నెలల క్రితమే బతుకుదెరువు కోసం ఆమె కువైట్‌కు వెళ్లింది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమెను ఇండియాకు పంపించకుండా యజమాని హింసిస్తున్నాడు. రూ.1.50 లక్షలు కడితేనే పంపిస్తానని ఏజెంట్ చెబుతున్నాడు. దీంతో సుమను ఇండియాకు తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: వీడేం పోలీసురా...ప్రేమ పెళ్లి.. ఆపై వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకుని...