/rtv/media/media_files/2025/07/28/poor-man-2025-07-28-20-58-23.jpg)
India's "Poorest Man" Found In Madhya Pradesh, Income Certified As Zero
భారత్‌లో ఓ ఆస్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత పేద వ్యక్తిగా ఒకతను నిలిచాడు. ఆ వ్యక్త వార్షికాదయం చూసుకుంటే సున్నాగా ఉంది. ఇటీవల అధికారులు జారీ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఆదాయం సున్నా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే సత్నా జిల్లా అమ్దారీ గ్రామంలో సందీప్ కుమార్ నామ్‌దేవ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఏమీ సంపాదన లేదు. అతడి వార్షికాదాయం రూ.సున్నా(0)గా అధికారులు ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేశారు.
Also Read: వీడసలు డాక్టరేనా? నిద్రపోయిన డాక్టర్..గాలిలో కలిసిన పేషేంట్ ప్రాణం
ఏప్రిల్ 7న ప్రాజెక్ట్ అధికారి రవికాంత్ శర్మ ఈ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. చివరికి జులై 20న అధికారులు అతడి సర్టిఫికేట్‌ను రద్దు చేశారు. సందీప్ వార్షికాదాయం రూ.40 వేలుగా సవరిస్తూ మరో ఆదాయ ధృవీకరణ పత్రం జారీ చేశారు. ఇదిలాఉండగా మరో షాకింగ్ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. సత్నా జిల్లాలోనే కోఠీ తహసీల్ ప్రాంతంలో నయాగావ్ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ అనే వ్యక్తికి వార్షికాదాయం రూ.3 గా పేర్కొంటూ ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే అతడు నెలకు 25 పైసలు మాత్రమే సంపాదిస్తున్నట్లు.
Also Read: కువైట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ.. ఇండియాకు పంపించకుండా హింసిస్తున్న యజమాని
ఇది కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ఆ తర్వాత రామ్ స్వరూప్ వార్షిక ఆదాయాన్ని రూ.30,000గా సవరిస్తూ కొత్త ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. ఈ రెండు సంఘటనలు వెలుగులోకి రావడంతో మధ్యప్రదేశ్‌లో అధికారులు జారీ చేస్తున్న ఇన్‌కమ్ సర్టిఫికేట్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.