/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
America’s tariff : ప్రపంచ దేశాలకు ట్రంప్ మరోషాక్ ఇచ్చారు. మరోసారి టారిఫ్ మెత మోగించేందుకు రెడీ అయ్యారు. వరుస ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు ట్రంప్. ఇప్పటికే చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్... తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా మరో 200 దేశాలపై టారీఫ్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10 లేదా 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 ప్రభుత్వంలో టారీఫ్‌ల మోత మోగుతోంది. సుంకాల పెంపుపై 200 దేశాలకు లేఖలు కూడా పంపనున్నారు. అన్ని దేశాలకు ఒకే విధంగా సుంకాలు ఉంటాయని.. టారీఫ్ రేటును నోటిసుల్లో పేర్కొంటామని స్పష్టం చేశారు. పెద్ద దేశాలు కానివి, తమతో అంతగా వ్యాపారం చేయని దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు.
Also Read : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు
మరోవైపు రష్యాతో వాణిజ్య వ్యాపారం చేస్తున్న దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ బిల్లును కూడా తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. అటు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. రష్యాతో వ్యాపారం చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్.. ఆర్థికంగా భారీ స్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు చేసేందుకు రష్యా అధక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఈ మూడు దేశాల నాయకులను కోరారు. అలా చేయకపోతే రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న వారిపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్‌తో 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో