Trump: మా బాంబులతో ఇరాన్ నేలమట్టం అవుతుంది.. ట్రంప్ సంచలన వార్నింగ్

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. మేము యుద్ధంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మా బాంబులతో ఇరాన్ నేలమట్టమవుతుందని వార్నింగ్ హెచ్చరించారు.

New Update
Trump Sensational Comments on Iran

Trump Sensational Comments on Iran

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. మా బాంబులతో ఇరాన్ నేలమట్టమవుతుందని తెలిపారు. '' ఇజ్రాయెల్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చేయడం నా నిర్ణయం కాదు. న్యూక్లియర్‌ లేకుండా చేయడమే మా లక్ష్యం. మేము యుద్ధంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా బాంబులతో ఇరాన్ నేలమట్టం అవుతుందని'' అన్నారు. 

Also Read: ఇజ్రాయెల్‌లో ఆస్పత్రిపై ఇరాన్ దాడులు.. పరుగులు తీసిన వైద్యులు, పేషెంట్లు

Trump Comments On Iran

అయితే ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్‌పై యుద్ధానికి దిగాలని గతంలోనే ట్రంప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలా దాడి చేయాలని ముందుగానే ట్రంప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు. ఇక వచ్చే వారంలో ట్రంప్ కీలక చర్యల దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.   

Also Read: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. మళ్లీ వీసాలు షురూ

మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అమెరికా జోక్యం చేసుకోకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు సైనిక సాయం చేయకూడదని.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్‌కు మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు. అయితే పుతిన్‌ వ్యాఖ్యలపై తాజాగా ట్రంప్‌ కౌంటర్ ఇచ్చారు. ముందుగా మీ సంగతి చూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. జెలెన్‌స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలని.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.  

Also Read :  ఏపీలో 'కుబేరా' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్!

Also Read :  మమ్మట్టి ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆ సమస్యతో చికిత్స!

 

rtv-news | israel-iran-war

Advertisment
Advertisment
తాజా కథనాలు