Mammootty: మమ్మట్టి ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆ సమస్యతో చికిత్స!

మమ్ముట్టి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్న వేళాఆయన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మమ్ముట్టి ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. మమ్ముట్టికి చిన్న ఆరోగ్య సమస్య ఉందని, దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని తెలిపారు.

New Update
Mammootty health update

Mammootty health update

Mammootty:  మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై గత కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు క్యాన్సర్ వచ్చిందని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ పుకార్లను ఆయన టీమ్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మమ్ముట్టి ఆరోగ్యంపై (Mammootty health) మరోసారి  స్పష్టత ఇచ్చారు. 

Also Read: Priyanka Jain: బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న ఫొటోలు

చిన్న ఆరోగ్య సమస్య

ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బ్రిట్టాస్ మమ్ముట్టి ఆరోగ్యం గురించి మాట్లాడారు. ''మమ్ముట్టికి  చిన్న ఆరోగ్య సమస్య ఉంది.  దానికి సంబంధించి ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు  ఆయన బాగానే ఉన్నారు. కాసేపటి క్రితమే  ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను'' అని బ్రిట్టాస్ తెలిపారు. మమ్ముట్టి  బాగానే ఉన్నారని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఆ సమస్య ఏంటి అనే దాని గురించి మాత్రం మాట్లాడలేదు. అలాగే  బ్రిట్టాస్ మమ్ముట్టితో తన స్నేహం గురించి కూడా మాట్లాడారు.  తామిద్దరూ చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులమని తెలిపారు. అయినప్పటికీ  వ్యక్తిగత విషయాలను పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదని అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి విషయాలను కూడా పంచుకుంటున్నామని చెప్పారు. 

ఇదిలా ఉంటే ఇటీవలే మమ్ముట్టి టీమ్ కూడా ఆయన  త్వరలోనే షూటింగ్‌కు తిరిగి వస్తారని తెలిపింది. ప్రస్తుతం మమ్ముట్టి  మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మోహన్‌లాల్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. కాగా, పలు ఆరోగ్య సమస్యలతో ఈ సినిమా షూటింగ్ కాస్త విరామం తీసుకున్నట్లు సమాచారం. 

Also Read: HBD Kajal: ట్విట్టర్ లో ట్రెండవుతున్న కాజల్.. ఈ మ్యాషప్ వీడియోలు చూస్తే ఫిదా!

Advertisment
Advertisment
తాజా కథనాలు