Trump: టెస్లాపై దాడి చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష.. ట్రంప్‌ హెచ్చరిక

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

New Update
Donald Trump and Elon Musk

Donald Trump and Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులు దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ దాడులకు ప్రోత్సహిస్తున్న వారిపై కూడా జైలు శిక్ష తప్పదంటూ పోస్టు చేశారు. ఈ మధ్య చూసుకుంటే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా టెస్లా షోరూమ‌లు, విద్యుత్ చార్జింగ్ స్టేషన్‌లు, కార్లపై దాడులు జరిగాయి. 

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ట్రంప్ దీనిపై స్పందించారు. ఈ దాడులకు పాల్పడేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఎలాన్ మస్క్‌ను డిఫార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ     (DOGE) విభాగం అధినేతగా ట్రంప్‌ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి టెస్లా సంస్థ ఆస్తులపై దాడులు పెరుగుతూ వస్తున్నాయి.  

Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని మస్క్‌ సలహా మేరకు ట్రంప్‌ సర్కార్‌ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది. ట్రంప్‌తో పాటు ఎలాన్‌ మస్క్‌పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోని ఆయన కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఎదుట నిరసనలు చేపట్టారు. మస్క్‌తో విభేధిస్తున్న కొంతమంది సనెటర్లు కూడా వాళ్లకి సపోర్ట్ చేశారు. తాము టెస్లా కార్లు అమ్మేస్తామని చెప్పారు.

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read: విద్యార్థులకు శృంగార పాఠాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

 rtv-news

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు