Sex Education: విద్యార్థులకు శృంగార పాఠాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విద్యాసంస్థల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యా్ర్థులకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్‌ను అమలు చేయనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
New Update
Karnataka to introduce sex education

Karnataka to introduce sex education

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విద్యాసంస్థల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్‌ను అమలు చేయనుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్రి మధు బంగారప్ప శాసన మండలిలో ఈ విషయాన్ని వెల్లడించారు. కౌమర దశలో ఉన్నప్పుడు శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి టీనెజర్లకు విస్తృత అవగాహన పెంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.  

Also Read: మరో డిజిటల్‌ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

ప్రతీవారంలో రెండుసార్లు వైద్య నిపుణులు ఈ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తారు. అలాగే ఏడాదికి రెండుసార్లు హెల్త్ చెకప్, కౌన్సెలిగ్ సెషన్స్‌ ఉంటాయి. విద్యార్థులకు పరిశుభ్రత, అంటువ్యాధులు, డ్రగ్‌ వల్ల కలిగే నష్టాలు వంటి వాటిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన కల్పిస్తారు. కర్ణాటక ప్రభుత్వం సెక్స్ ఎడ్యుకేషన్‌తో పాటు సైబర్ హైజీన్ క్లాసెస్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తోంది. డిజిటల్ అడిక్షన్, ప్రీమెచ్యూర్‌ సెక్సువల్ యాక్టివిటీ, టీనెజ్‌ గర్భాలు వంటి వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఈ క్లాసెస్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ క్లాసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.  

Also Read: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!

అంతేకాదు నైతిక విద్య కూడా ప్రతి పాఠశాలలో తప్పనిసరి సబ్జెక్ట్‌ కానుంది. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈ సబ్జెక్ట్‌ ఉండనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతివారం రెండుసార్లు దీనికి సంబంధించి సెషన్స్‌ నిర్వహించనుంది. ఇందులో నిజాయితి, సహనం, సత్యాలు చెప్పడం లాంటి విలువలను నేర్పించనున్నారు. అలాగే చిన్నారుల భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు కూడా విద్యా్ర్థులకు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించనున్నరు. దీనిపై సెషన్స్‌ ఉన్నప్పటికీ.. విద్యార్థులకు తమ హక్కులు, చట్టపరమైన భద్రత గురించి మరింత మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

 karnataka | rtv-news | national-news

Advertisment
Advertisment
తాజా కథనాలు