Allahabad: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

మహిళ వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం కాదంటూ అలహాబాద్‌ హైకోర్టు జడ్జీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఖండించారు. ఇలాంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసు మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు. 

New Update
alahabad court

Minister Annapurna Devi fire on Allahabad High Court judge

మైనర్ బాలిక హత్యాచార యత్నం ఘటనపై అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్రంగా ఖండించారు. మహిళ ఛాతీని తాకడం అత్యాచారంగా పరిగణించలేమంటూ న్యాయమూర్తి రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఆ తీర్పు సమ్మతం కాదని, ఇలాంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ ఇష్యూను మరోసారి పరిశీలించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు.

Also Read :  తెలంగాణ హైకోర్టుకు యాంకర్‌ శ్యామల!

బైక్‌పై ఎక్కించుని అసభ్యంగా తాకుతూ..

ఉత్తరప్రదేశ్‌ కసగంజ్‌లో  2021 నవంబరులో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తన 11ఏళ్ల కుతురితో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుని మార్గమధ్యంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బాలిక అరుపులు విని స్థానికులు స్పందించగా నిందితులు పారిపోయారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అలహాబాద్‌ హైకోర్టుకు చేరగా గురువారం విచారణ జరిగింది. 

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశం..

ఈ కేసును మొదట విచారించిన అలహాబాద్ ట్రయల్ కోర్టు.. పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 18 (అత్యాచారం, నేరం చేయడానికి ప్రయత్నించడం) ప్రకారం నిందితులకు సమాన్లు పంపింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసుపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మైనర్ బాలికల వక్షోజాలను పట్టుకోవడం,  పైజామా దారం తెంపివేయడం, పారిపోయే ముందు ప్యాంట్ కిందికి లాగడం అత్యాచారయత్నంగా పరిగణించబడవు. ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 15 నేరాల కిందికి రాదు. కానీ పోక్సో సెక్షన్ 9/10, సెక్షన్ 354-B ( లైంగిక వేధింపులు, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) ప్రకారం సమన్లు జారీ చేయొచ్చు అని స్పష్టం చేశారు. 

Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్‌2: ఎంపురాన్‌' ట్రైలర్..!

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

 

minor girl case | latest-telugu-news | alahabad | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు