Trump: ఉక్రెయిన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ట్రంప్‌కు తేల్చిచెప్పిన పుతిన్

ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము గట్టిగా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు 75 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడానని తెలిపారు.

New Update
Trump says Putin will seek revenge for Ukraine drone attack

Trump says Putin will seek revenge for Ukraine drone attack

ఇటీవల రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత రష్యా కూడా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకపడింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి. అయితే తాజాగా ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము గట్టిగా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో చెప్పినట్లు తన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు.

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Also Read: వడా పావ్ కోసం ముంబై వీధుల్లో కెక్కిన స్టార్‌ హీరోయిన్‌.. అందాల్ని చూపిస్తూ..

దాదాపు 75 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడానని తెలిపారు. ఇందులో రష్యా యుద్ధ విమానాలపై ఉక్రెయిన్ దాడితో పాటు ఇతర దాడుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. తమ సంభాషణ సవ్యంగానే సాగినప్పటికీ.. ఇది తక్షిణ శాంతికి దారి తీయలేదని వివరించారు. అలాగే ఇరాన్‌ అణు ఆయుధాల గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. అణు ఆయుధాలకు సంబంధించి ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఇచ్చిన గడువు కూడా ముగుస్తోందని, దీనిపై ఇరాన్ నుంచి వెంటనే సమాధానం కావాలని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో జరగబోయే చర్చల్లో పుతిన్ కూడా పాల్గొంటానేందుకు ఆసక్తి చూపారని ట్రంప్‌ స్పష్టం చేశారు.     

ఇదిలాఉండగా 2026 ఏప్రిల్ నాటికి 350 మిలియన్ పౌండ్ల విలువైన లక్ష డ్రోన్లు అందిస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు కీవ్‌కు ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలటరీ సపోర్ట్‌లో ఇది భాగమని తెలిపింది. ఇక రష్యా రక్షణ విభాగ ఉన్నతాధికారి బుధవారం ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు వెళ్లారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక ఒప్పందాన్ని పొడిగించే అశంపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.  

Also Read: తొక్కిసలాటకు కారణం ఆ పుకారే.. RCB తొక్కిసలాటపై షాకింగ్ నిజాలు!

ఇదిలాఉండగా ఇటీవల రష్యా భూభాగంలోకి 4 వేల కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన ఉక్రెయిన్.. అక్కడి వైమానిక స్థావరాలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఆ తర్వాత రష్యా కూడా 400లకు పైగా డ్రోన్లతో కీవ్‌పై విరుచుకుపడింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారింది. ఈ దాడికి తాము గట్టిగా బదులిస్తామని పుతిన్ తాజాగా ట్రంప్‌తో చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

telugu-news | rtv-news | trump | russia ukraine conflict

Advertisment
Advertisment
తాజా కథనాలు