Trump: మూడోసారి అధ్యక్ష పదవి.. స్పందించిన ట్రంప్

ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.

New Update
Trump

Trump

ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు. తాను మూడోసారి అధ్యక్ష పదవి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. దీనికి రాజ్యాంగం పర్మిషన్ ఇవ్వదని పేర్కొన్నారు. '' ఎన్నికల గణాంకాల ప్రకారం చూసుకుంటే నేను ముందు వరుసలో ఉన్నాను. నేను పోటీ చేసేందుకు పర్మిషన్ లేదని భావిస్తున్నాను. ప్రజల నుంచి మద్దతు ఉన్నా పోటీకి అనుమతి లేకపోవడం దారుణమని'' ట్రంప్ అన్నారు.  

Trump Says 'Not Allowed' To Run For Third Term

Also Read: బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. దూసుకొస్తున్న సైలెంట్ వేవ్.. ఆ కూటమికి ఊహించని షాక్?

ట్రంప్(Donald Trump) రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇటీవల తాను మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానంటూ మాట్లాడారు. 2028లో ఉపాధ్యక్షుడికి పదవికి కూడా పోటీ చేయాలనే ఆలోచనను ట్రంప్ తిరస్కరించారు. ఆ ఆలోచన బాగున్నప్పటికీ ప్రజలు ఇష్టపడరని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసేందుకు తనకు ఛాన్స్ ఉందని.. అది తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కానీ మూడోసారి అధ్యక్ష పదవి పోటీ చేసేందుకు మార్గాలున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్‌ స్పందించారు. ట్రంప్ మూడోసారి ఎన్నికకు రాజ్యాంగంలో ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. 

Also Read: ఆధార్‌ కార్డు నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు.. నవంబర్ 1న మారనున్న కొత్త రూల్స్ ఇవే!

మరోవైపు ట్రంప్ గాజా పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు. అక్కడ శాంతియుత పరిస్థితులను ఎవరూ అస్థిరపర్చలేదని అన్నారు. ఒకవేళ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించకపోతే ఇజ్రాయెల్ దాడులు చేయడం కరెక్టేనన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అమెరికా బలగాలు మోహరించిందని.. ఇజ్రాయెల్‌కు తమ సపోర్ట్ ఇస్తామని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు