/rtv/media/media_files/2025/10/29/bihar-2025-10-29-12-49-55.jpg)
ఇప్పడు దేశం చూపంతా బీహార్ వైపే ఉన్నాయి. ఇక్కడ మరోసారి ఎన్డీయే కూటమి విజయం సాధించబోతోందా? లేక ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి జెండా ఎగరవేయబోతోందా? నితీష్ ఊహించని ట్విస్ట్ ఏమైనా ఇస్తాడా? ఆ ప్రభావం కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఎలా ఉండబోతోంది? ఇలాంటి ప్రశ్నలకు మరో 17 రోజుల్లో సమాధానం రానుంది. అయితే.. ఈ సారి ఎవరూ ఊహించని రిజల్ట్స్ వస్తాయని.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రీవర్స్ అవుతాయని విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. నవంబర్ 14న వెలువడనున్న ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ఎన్నికలంటే పెద్ద ఎత్తున హడావుడి, పెద్ద ర్యాలీలు, బహిరంగ ప్రకటనలు, రాజకీయ నాయకుల స్పీచులు, హామీలతో హోరెత్తుతాయి. అయితే అందుకు విరుద్దంగా ఇప్పుడు బీహార్ ఎన్నికలు కనిపిస్తున్నాయి. పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ర్యాలీలు, మీటింగ్ ల వద్ద కూడా జనాలు కూడా రావడం లేదు. ఈ నిశబ్ద విప్లవం ఫలితాల సరళిని పూర్తిగా మార్చివేయవచ్చునని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మహిళా ఓటర్ల నుంచి వచ్చిన సైలెంట్ వేవ్ నితీష్ ను మరో సారి గద్దెనెక్కించింది. ఇదే తరహాలోనే ఈసారి కూడా వారు ఓటు ఎవరికి వేయబోతున్నారనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. నిరుద్యోగం, వలసలు వంటి అంశాలపై అసంతృప్తి ఉన్న యువత కూడా తమ ఓటును ఎవరికి వేయబోతున్నారో బహిరంగంగా ప్రకటించడం లేదు. మార్పును కోరుకునే ఈ యువత ఓటు నిశ్శబ్దంగా ఒకవైపు మొగ్గు చూపితే, ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు.
నితీష్ కుమార్ బోలేడు హామీలు
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలానే హామీలు ఇచ్చారు. 2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని, మహిళలకు నెలకు రూ.30వేలు ఇస్తామని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అటు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఏకంగా అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపు ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.2,500 నుంచి - రూ.3,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని తెలిపారు. దీనికి తోడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యేల ప్రభావం ఫలితాలపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.
2020 ఎన్నికల్లో కూడా ఫలితాలు అంచనాలకు భిన్నంగా వచ్చాయి. ఈసారి కూడా ఇదే పునరావృతమైతే, నవంబర్ 14న తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో (నవంబర్ 6. నవంబర్ 11 తేదీల్లో) పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాధారణంగా దేశంలో ఎన్నికల వచ్చినప్పుడు జాతీయ స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి. బీహార్ లో ఎలాంటి ఫలితాలు వచ్చిన అందుకు అందుకు పెట్టుబడిదారులు సిద్దంగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Follow Us