/rtv/media/media_files/2025/01/22/TCUTm10W3mt5Zc1nkVOm.jpg)
trump putin
ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని, వారిని రక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్​తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపాను. రక్తపాతం సృష్టిస్తోన్న ఈ భయంకర యుద్ధం ఎట్టకేలకు ముగిసే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.
ప్రస్తుతం వారంతా ఆపదలో ఉన్నారు. అందుకే వారి ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను గట్టిగా అభ్యర్థించాను. '' రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపాను. రక్తపాతం సృష్టిస్తున్న ఈ యుద్ధం ఎట్టకేలకు ముగిసే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే వేలాది మంది ఉక్రెయిన్ బలగాలను రష్యా సైన్యం చుట్టుముట్టింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం ఆపదలో ఉంది. వాళ్ల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను గట్టిగా అభ్యర్థించాను. లేకపోతే ఇది రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎవరూ చూడని భయంకరమైన ఊచకోతగా మారే ఛాన్స్ ఉంది. వాళ్లకి భగవంతుడు అండగా ఉండాలని ఆశిస్తున్నానని'' డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్య వేదికగా అయిన ట్రూత్ సోషల్‌లో తెలిపారు.
మరోవైపు అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై పుతిన్ సానుకూలంగా స్పందించారు. ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని, సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలని అభిలషించారు. ఇలా స్పందించిన కొన్ని గంటలకే ట్రంప్‌తో సంభాషించడం గమనార్హం.
Also Read: Bsnl Cheapest Recharge Plan: ఓరి దేవుడా.. రూ.750లకే 6 నెలల వ్యాలిడిటీ- 180 GB డేటా కూడా!
Follow Us