/rtv/media/media_files/2025/02/05/0QQ5zv5yJa33sl2QAYlB.jpg)
Iran Nuclear Weapons
అణ్వాయుధాల తయారీకి ఇరాన్ దేశం ఆగమేఘాల మీద సిద్ధం అవుతోంది. తమ దేశానికి వస్తున్న చమురు నిల్వలను ఉపయోగించుకుని వీటిని తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. అయితే దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెక్ పెట్టారు. కఠిన విధానాలను మళ్లీ అమలుచేసేలా మెమోపై ట్రంప్ సంతకం చేశారు. టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చేలా రూల్స్ ను పెట్టారు. దీని దీని ద్వారా అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెప్పారు. అంతేకాదు తనను చంపాలని చూస్తే ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని హెచ్చరించారు.
Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
న్యూక్లియర్ ఒప్పందానికి నో..
కొద్ది రోజుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ట్రంప్ భేటీ కానున్నారు. దానికన్నా ముందే ఇరాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మొదటిసారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇరాన్ అణ్వాయుధాల తయారీపై నిషేధం ఉంది. తరువాత బైడెన్ ప్రభుత్వంలో దాన్ని ఎత్తేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తూ మెమరాండంపై ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ తో తనకు ఏమీ శతృత్వం లేదని..ఆ దేశంలో డీల్ కు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. కానీ న్యూ క్లియర్ ఒప్పందానికి మాత్రం కాదు అని ట్రంప్ చెప్పారు. ఇరాన్ దేశ నాయకుడితో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగాను ఉన్నట్టు వెల్లడించారు. బైడెన్ ప్రభుత్వంలో టెహ్రాన్ అణ్వాయుధాల తయారీకి అనుమతులు దక్కాయని ఆయన మండిపడ్దారు.
Also Read: Bengaluru: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం..