America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వారందరినీ పట్టుకుని.. తిరిగి వారి దేశాలకు యూఎస్‌ పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెళ్లకుండా పట్టుబడితే.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్‌ఎస్‌ చెప్పింది.

New Update
America migrants

America migrants

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపై ట్రంప్ యంత్రాంగం మరింత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు మరింతగా వారిని వారి దేశాలకు పంపేందుకు సిద్ధమైంది. అక్రమ వలసదారులు తక్షణమే అమెరికా వీడి వెళ్లిపోవాలని లేకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వెళ్లకపోతే రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని, అది కూడా కట్టకపోతే వారు ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడే వారిని అమెరికా తిరిగి వారి దేశాలకు పంపిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నదే అయినా.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులపై చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను కూడా తీసుకువచ్చింది అమెరికా. ఈ యాప్ ద్వారా పేరు నమోదు చేసుకుని ఎవరికివారు స్వయంగా దేశం వీడి వెళ్లిపోయే వెసులుబాటు ఉంటుంది.అలా కాకుండా అధికారులు గుర్తిస్తే తమ పద్ధతుల్లో అక్రమ వలదారులను వెనక్కి పంపించాల్సి ఉంటుందని, ఇతర చర్యలు తీసుకుంటామని డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాలిన్ మీడియాతో పేర్కొన్నారు. తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. 

ముఖ్యంగా సెల్ఫ్ డిపోర్టేషన్‌కు సంబంధించి హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం మార్చి 31న సోషల్ మీడియా వేదికగా కీలక సమాచారాన్ని పంచుకుంది. తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్ధీకరణకు ఎటువంటి అవకాశం ఉండబోదని, సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బహిష్కరణ ఆదేశాలు అందుకున్న తర్వాత వెళ్లిపోకపోతే రోజుకు 998 డాలర్లు జరిమానా, సెల్ఫ్ డిపోర్ట్ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత వెళ్లపోకపోతే రోజూ 1000- 5 వేల డాలర్లు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశం కూడా కోల్పోతారని పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని అప్పుడు తొలిసారి అమలు చేస్తున్నారు. 9 మంది అక్రమ వలసదారులపై జరిమానా విధించినప్పటికీ, అందులో కొందరిపై ఉపసంహరించుకున్నారు. ట్రంప్ తర్వాత బైడెన్ వచ్చాక జరిమానాలు విధించడాన్ని నిలిపివేశారు. అక్రమ వలసదారుల్లో భయాన్ని కలిగించేందుకు ఈ జరిమానాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

Also Read: Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్

 

america | migrants | illeagal-migrants | illegal immigrants america | Indian illegal immigrants | america illegal immigrants news | Immigrants | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. 32 మంది సైనికులు హతం!

బలూచిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేపై ఆపి ఉంచి ఉన్న కారులోని పేలుడు పదార్థం పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

New Update
Pakistani military

Pakistani military

పాకిస్తాన్‌లో మరోసారి సైన్యంపై దాడి జరిగింది. బలూచిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేలోని ఖుజ్దార్‌లోని జోరో పాయింట్ సమీపంలో జరిగిన బాంబు పేలుడులో పాక్ సైనికులు చనిపోవడంతో పాటు వందల మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

హైవేపై ఆపి ఉంచిన కారులో..

ఆపి ఉంచిన కారులో అమర్చిన పేలుడు పదార్థం పేలిపోవడంతో ఎనిమిది వాహనాలు, బస్సుపై వీటి ప్రభావం పడింది. ఈ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలో ఒకటి సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్న బస్సు. వీరిలో భారీగా గాయపడటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Advertisment
Advertisment
Advertisment