America Elections: అమెరికా ఎన్నికల్లో భారీ మార్పులు..చేర్పులు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ లో భారీ మార్పలకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు..

New Update
Donald Trump

Donald Trump

అగ్రరాజ్య పీఠమెక్కిన నాటి నుంచి అమెరికా ఫెడరల్‌ వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా పని చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌ ..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ లో భారీ మార్పలకు సిద్ధమయ్యారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ తాజాగా సంతకం చేశారు. కొత్త నియమాలకు సంబంధించి భారత్‌, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా చూపించడం మరో విశేషం. స్వయం పాలనలో మనం ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాం. అయినప్పటకీ.. ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక , అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో యూఎస్‌ విఫలమైంది.

Also Read: Sajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

ఉదాహరణకు భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్‌ డేటాబెస్‌ తో అనుసంధానిస్తున్నాయి. కానీ, అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణ పై ఆధారపడుతోంది. జర్మనీ,కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్‌ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయి.

మన ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి అని ట్రంప్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం..ఇక పై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది.అంటే యూఎస్‌ పాస్‌ పోర్టు లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి.

దీంతో పాటు ఎన్నికల ప్రక్రియలో మరిన్ని కఠిన నిబంధనలను ట్రంప్‌ తీసుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ లో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్‌ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో చాలా మంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్‌ లేదా మెయిల్‌ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో సవరణలకు సంబంధించి ట్రంప్‌ గతంలోనే వెల్లడించారు.మోసాలు, లోపాలు లేని స్వేచ్ఛాయుత, న్యాయపరమైన ,నిజాయతీ గల ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత. అసలైన విజేతను నిన్ణయించడానికి ఈ మార్పులు చాలా అవసరం అని అప్పట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

2020లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల విధానం పై ట్రంప్‌ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Mohul Choksi: ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

Also Read: Trump-Musk:ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడు: ట్రంప్

 

america | elections | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు