/rtv/media/media_files/2025/03/23/Cg9XpljoX2nx3KwUuruk.jpg)
Choksi
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని, భార్య ప్రీతితో కలిసి ఆ దేశంలోనే నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని బెల్జియం ప్రభుత్వం ధ్రువీకరించింది.బెల్జియం విదేశాంగ మంత్రిత్వశాఖ ఛోక్సీ తమ దేశంలోనే ఉన్నట్లు తెలిపింది.
Also Read: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
అయితే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత కేసుల పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పరిణామాలను ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఛోక్సీని తమకు అప్పగించాలని కోరుతూ భారత అధికారులు ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న ఛోక్సీ మేనల్లుడు నీరవ్ మోడీని లండన్ నుంచి తీసుకొచ్చేందుకు సైతం భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను దాదాపు రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018 లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ ,మోడీ దేశం విడిచి పారిపోయారు.
ఛోక్సీ అంటిగ్వా-బార్బుడాకు పారిపోగా..నీవర్ బ్రిటన్ జైలులో ఉన్నాడు. వీరిని భారత్ కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన అంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛేత్ గ్రీన్ మాట్లాడుతూ..మోహుల్ ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని,వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు.
ఛోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ...ఆయన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. బెల్జియం జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో మోహుల్ ఛోక్సీ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు సమాచారం. ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు. దీని కోసం ఆయన తప్పుడు పత్రాలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఓ వార్తాకథనం పేర్కొంది. ఛోక్సీ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు.
Also Read: Modi-Trump: టారిఫ్‌లు తగ్గించేందుకు మోదీ సర్కార్ చర్యలు..ట్రంప్ ఎఫెక్టేనా!
Also Read: Trump-Musk:ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడు: ట్రంప్
mohul choksi | belgium | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates