America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్‌ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది.

New Update
usa

US President Trump

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్‌ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది. రెవెన్యూ విభాగంలో పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 20 నుంచి 25 శాతం మంది సిబ్బందికి లే ఆఫ్‌ లు ఇవ్వనున్నట్లు యూఎస్‌ ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారులు పేర్కొన్నారు.

Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!

వీరిలో ముందుగా పౌర హక్కుల కార్యాలయ ఉద్యోగుల పై వేటు పడనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి మెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది. కేవలం ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్న అమెరికా ప్రభుత్వ ఆదేశాల మేరకు,యూఎస్‌ ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ ఉద్యోగాల తొలగింపునకు రెడీ అయ్యింది.

Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!

దీని ఫలితంగా రెవెన్యూ  విభాగానికి చెందిన బహుళ కార్యాలయాలు, ఉద్యోగాల్లోని సిబ్బంది పై వేటు పడనుంది అని రెవెన్యూ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌ లో పేర్కొన్నారు.పౌర హక్కుల కార్యాలయం నుంచి సుమారు 75 శాతం మందిని తొలగిస్తామని...మిగిలిన ఉద్యోగులను ప్రత్యేక కార్యాలయాల కిందకు మారుస్తామని...దశలవారీగా తొలగింపులు జరుగుతాయని అందులో తెలిపారు.

కాగా ఫెడరల్‌ వర్క్‌ఫోర్స్‌ నుంచి ఇప్పటికే రెండు లక్షల  మంది కార్మికులు ఉద్యోగాల నుంచి వైదొలిగారు. ప్రభుత్వ ఉద్యోగాల కోతల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం ఇటీవల అక్కడి ఆరోగ్య విభాగం పై కొరడా ఝుళిపించింది.ఇందులో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌ ఇటీవల ప్రకటించారు.

తద్వారా ఏడాదికి దాదాపు 1.8 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతుందన్నారు. కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది.మరో వైపు ఉద్యోగాల తొలగింపునకు ట్రంప్‌ సర్కార్‌ బై అవుట్‌ ను అస్త్రంగా చేసుకుంది. ఈ మేరకు ఒక ఈ మెయిల్‌ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో వివరించిన సంగతి తెలిసిందే.

ఉద్యోగాలు మానేద్దామని అనుకొని ఆగిపోయిన వారు దీనిని ఎంచుకోవచ్చు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికాప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్‌ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.

Also Read:Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌...వారంలో మెగా డీఎస్సీ!

Also Read: Hyderabad: సికింద్రాబాద్‌ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!

trump | america | layoffs | jobs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు