/rtv/media/media_files/2025/09/05/trump-dreams-immortality-at-mount-rushmore-2025-09-05-18-48-42.jpg)
Trump Dreams Immortality At Mount Rushmore
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. అమెరికాలోని సౌత్ డకోటాలో మౌంట్ రష్మోర్ అనే కొండ ఉంటుంది. దీనిపై నలుగురి ప్రముఖ అధ్యక్షుల ముఖ శిల్పాలను చెక్కారు. ఇప్పుడు వాళ్ల పక్కన తన శిల్పాన్ని కూడా చెక్కించేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఎక్స్‌లో కూడా ఓ ఏఐ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ నలుగురి అధ్యక్షుల ముఖాల పక్కనే ట్రంప్‌ది కూడా ఉన్నట్లు చూపించారు.
Also Read: విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. రూ.23 లక్షల స్కాలర్‌షిప్
Trump Dreams Immortality At Mount Rushmore
— Donald J. Trump (@realDonaldTrump) September 5, 2025
సౌత్ డకోటాలోని కీస్టోన్ వద్ద ఉన్న బ్లాక్‌హిల్‌పై ఈ మౌంట్ రష్మోర్(Mount Rushmore) నేషనల్ మెమోరియల్ ఉంది. గుట్జోన్ బొర్గలుమ్ అనే శిల్పి అక్కడున్న భారీ గ్రానైట్‌పై అధ్యక్షుల ముఖచిత్రాలను చెక్కారు. అందులో మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, రూస్‌వెల్డ్, అబ్రహం లింకన్ ముఖాలు ఉన్నాయి. వీళ్లందరూ కూడా తమ పదవీ కాలంలో అమెరికాను బలోపేతం చేసిన అధ్యక్షులుగా గుర్తింపు పొందారు. వాళ్ల గౌరవార్థం అక్కడ వారి శిల్పాలను చెక్కారు. ఒక్కో శిల్పం 60 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. వీటిలో తన ముఖచిత్రం కూడా ఉండాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం తాను రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫిబ్రవరిలో కాంగ్రెస్ ఉమెన్ అన్నా పౌలినా ట్రంప్ శిల్పం అక్కడ ఏర్పాటు చేయాలంటూ ఓ బిల్లును కూడా తీసుకొచ్చారు.
ఆ కొండపై తన శిల్పం చెక్కించాలని కోరింది కేవలం ట్రంప్ మాత్రమే కాదు. గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు అక్కడ తమ ముఖచిత్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. జాన్ ఎఫ్ కెన్నడీ, రోనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా తదితర మాజీ అధ్యక్షులు అక్కడ తమ శిల్పాలు ఉండాలని కోరుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ట్రంప్ కూడా వీళ్లలాగే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అధికారులు మాత్రం అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఆ కొండపై ఐదో ముఖం చెక్కేందుకు చోటు సరిపోదని అంటున్నారు. అంతేకాదు మౌంట్ రష్మోర్‌ను నిర్వహిస్తున్న నేషనల్ పార్క్ సర్వీసు కూడా అక్కడ ఐదో తల ఏర్పాటు చేసేందుకు సురక్షితమైన ప్రదేశం లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ ట్రంప్ ముఖచిత్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేవనే తెలుస్తోంది. మరి ట్రంప్ ఎలాగైన అక్కడ తన శిల్పం ఉండేలా ఇతర మార్గాలను అన్వేషిస్తారా ? లేదా వదిలేస్తారా అనేది ఆసక్తిగా మారింది.
Also Read: ఆ కంపెనీ సీఈఓకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండియాపై మరోసారి అక్కసు!