Donald Trump: ఆ కంపెనీ సీఈఓకు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండియాపై మరోసారి అక్కసు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్‌పై సుంకాలు విధించి అక్కసు గక్కారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు సీఈఓ టిమ్ కుక్‌ను పరోక్షంగా బెదిరించినట్లుగా తెలుస్తోంది.

New Update
Tim cook

Tim cook

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్‌పై సుంకాలు విధించి అక్కసు గక్కారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు సీఈఓ టిమ్ కుక్‌ను పరోక్షంగా బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో కాకుండా అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలని కుక్‌కు సూచించారని సమాచారం. అయితే ట్రంప్ అమెరికాలో పెట్టుబడులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలతో తరచుగా సమావేశాలు నిర్వహించేవారు. ఈ క్రమంలోనే ట్రంప్ టెక్ దిగ్గజాలైన మార్క్ జుకర్‌బర్గ్, టిమ్ కుక్, బిల్ గేట్స్ వంటి వారితో ప్రత్యేకంగా డిన్నర్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా హాజరయ్యారు. అయితే టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు. ఈ సమావేశంలో ట్రంప్ ప్రధానంగా అమెరికాలో పెట్టుబడులు పెంచడం, ఉద్యోగాలను సృష్టించడం వంటి అంశాలపై చర్చించారు.

ఇది కూడా చూడండి: Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దని..

ఈ సమావేశంలోనే ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడినట్లు సమాచారం. యాపిల్ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా, అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కుక్ అమెరికాలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ట్రంప్ హయాంలో యాపిల్ కంపెనీ చైనాకు బదులుగా ఇండియాలో తన తయారీ కార్యకలాపాలను విస్తరించాలని భావించింది. యాపిల్ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి కంపెనీలు కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలోనే ట్రంప్ యాపిల్‌ను ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా చేస్తున్నారని తెలుస్తోంది. యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెంచితే, ఇండియాలో పెట్టుబడులు తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో ఇండియాలో ఉద్యోగాలపై తీవ్రంగా ఎఫెక్ట్ పడనుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలి ప్రసక్తే లేదని.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Advertisment
తాజా కథనాలు