/rtv/media/media_files/2025/09/05/university-of-otago-scholarship-2025-09-05-18-00-33.jpg)
న్యూజిలాండ్(Newzeland) లోని ఒటాగో యూనివర్సిటీ(Otago Scholarship) భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. సుమారు రూ.23 లక్షల వరకు విలువైన ఈ స్కాలర్‌షిప్, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కు గొప్ప అవకాశం. ముఖ్యంగా, అకడమిక్‌గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ స్కాలర్‌షిప్‌లు దక్కుతాయి.
ఒటాగో విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్రణాళిక ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే భారతీయ విద్యార్థులకు(Indian Students) రూ.15,000 న్యూజిలాండ్ డాలర్లు (దాదాపు రూ. 7.76 లక్షలు) నుండి 45,000 న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ. 23.4 లక్షలు) వరకు స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. అదనంగా, అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫస్ట్ ఈయర్ కాలేజ్‌లో ఫ్రీ హాస్టల్ కల్పిస్తారు.
Also Read : ‘మీషో’లో జాబ్స్ జాతర.. నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాల పండగే
University Of Otago Scholarship
International Excellence Scholarship
— JobScholarHub (@JobScholarHub) September 4, 2025
📌University of Waikato
📌New Zealand 🇳🇿
Bachelor | Masters | PhD
Benefits
📌This Scholarship is valued up to NZD$15,000💰& will be awarded on Merit based to students
📌No IELTS
Apply Now👉 https://t.co/WvTAvVl7X3
Pls share ✅
Also Read : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ. 68వేల వరకు జీతంతో ఉద్యోగాలు
ఇటీవల న్యూజిలాండ్‌లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది న్యూజిలాండ్ మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో(US Foreign Students) 11% మంది భారతీయులే కాగా, వారి సంఖ్యలో 34% పెరుగుదల నమోదైంది. ఒటాగో విశ్వవిద్యాలయంలో మాత్రమే 2024లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు 45% పెరిగాయి.
ఈ నేపథ్యంలో, ఒటాగో విశ్వవిద్యాలయం 'వన్‌స్టెప్ గ్లోబల్' భాగస్వామ్యంతో భారతదేశంలోని ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో 'ఒటాగో ఎక్స్‌పీరియన్స్ స్టూడెంట్ ఔట్రీచ్' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా విశ్వవిద్యాలయం అధ్యాపకులతో సమావేశమై, కోర్సుల వివరాలు, స్కాలర్‌షిప్‌లు, కెరీర్ అవకాశాలపై సమాచారం తెలుసుకోవచ్చు. హెల్త్ సైన్సెస్, బిజినెస్, హ్యుమానిటీస్, సైన్సెస్ వంటి వివిధ కోర్సుల గురించి ఇందులో వివరిస్తారు.
ఒటాగో విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్, న్యూజిలాండ్ మాజీ డిప్యూటీ ప్రధాన మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను నేరుగా కలవడం చాలా ఉత్సాహంగా ఉంది. మా అధ్యాపకులు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, విద్యార్థుల భవిష్యత్తు ప్రయాణానికి సహాయపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం. భారతీయ విద్యా భాగస్వాములతో మాకు ఉన్న బలమైన బంధాన్ని ఇది ప్రతిబింబిస్తుంది" అని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒటాగో విద్యార్థుల్లో 95% మంది ఆరు నెలల్లోనే ఉద్యోగాలు పొందుతున్నారని, వారి సగటు వార్షిక ఆదాయం కూడా రూ. 45 లక్షలకు పైగా ఉంటుందని విశ్వవిద్యాలయం తెలిపింది.