/rtv/media/media_files/2026/01/04/indian-in-caracas-on-life-after-us-military-strikes-2026-01-04-18-57-53.jpg)
Indian in Caracas on life after US military strikes
వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులు చేసి ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ దాడుల వల్ల అక్కడి ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ వైమానిక దాడుల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో వెనెజువెలా రాజధాని కారకస్‌లో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సూపర్ మార్కెట్‌లు మూతపడ్డాయి. కరెంట్ , ఆహారం లేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: ట్రంప్‌లా మోదీ ఎందుకు చేయలేదు.. వెనిజులా ఘటనపై ఒవైసీ రియాక్షన్!
కారకస్‌లో ఉంటున్న ఓ భారతీయుడు అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడారు. కారకాస్‌లోని ఎయిర్‌పోర్టుపై కూడా అమెరికా దాడి చేసిందని అన్నారు. నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ వైమానిక స్థావరం ఉందని.. అది కూడా దెబ్బతింటుందని చెప్పారు. ఫోర్ట్‌ట్యూనా మిలిటరీ స్థావరం దగ్గర ఎక్కువ నష్టం జరిగిందని.. ఆ తర్వాత అన్ని సూపర్ మార్కెట్లు మూసివేశారని తెలిపారు. కేవలం చిన్న దుకాణాలు మాత్రమే తెరచి ఉన్నాయని అన్నారు. వాటిముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో 500 నుంచి 600 మంది బారులు తీరారని తెలిపారు.
Also Read: ఆపరేషన్ వెనెజువెలా, ఆగస్టు నుంచే ప్లాన్ చేసిన అమెరికా.. వెలుగులోకి సంచలన నిజాలు
ప్రజా రవాణా సేవలు సైతం ఆగిపోయాయని.. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని చెప్పారు. చాలా ఇళ్లల్లో విద్యుత్ లేకపోవడంతో ఫోన్‌లకి ఛార్చింగ్‌లు పెట్టడంలో కూడా ఇబ్బందులు పడుతునట్లు తెలిపారు. రోడ్లపై కొన్ని విద్యుత్ లైట్‌ల వద్ద కరెంట్ ఉండటంతో దాని నుంచి ప్రజలు తమ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరెంట్ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియదంటూ వాపోయారు. స్థానిక అధికారుల నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదని అన్నారు.
ఇదిలాఉండగా కారకస్‌లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భారతీయుల కోసం భారత ఎంబసీ ఓ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో నుంచే భారతీయులకు కీలక సూచనలు చేస్తోంది.
Follow Us