/rtv/media/media_files/2025/07/01/unemployed-man-kills-partner-out-of-jealousy-2025-07-01-12-23-24.jpg)
Unemployed Man Kills Partner Out Of Jealousy
ఈ మధ్యకాలంలో దంపతులు, లవర్స్ మధ్య గొడవలు జరగడంతో క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణం జరిగింది. మూడున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టిని ప్రియుడు రెండ్రోజుల పాటు డెడ్‌బాడి పక్కనే పడుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే రితికా సేన్ (29) సచిన్ రాజ్‌పుత్ (32) అనే వ్యక్తితో గత మూడున్నరేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే సచిన్‌కు ఇప్పటికే వేరే మహిళతో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Also Read: పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
స్థానిక గాయత్రినగర్‌లో రితికా, సచిన్ రాజ్‌పుత్ సహజీవనం చేస్తున్నారు. రితికా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. సచిన్‌కు మాత్రం ఎలాంటి ఉద్యోగం లేదు. ఆమె జీతంపైనే ఆధారపడేవాడు. దీంతో ఆమెపై ఎప్పుడూ అసూయ పడేవాడు. రితికా పనిచేస్తున్న కంపెనీ బాస్‌తో ఆమెకు సంబంధం ఉందని అనుమానిస్తుండేవాడు. ఈ విషయంలో వీళ్లిద్దరీ మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే జూన్ 27న వాళ్లిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో రితకాను అతడు హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి మంచంపై పెట్టాడు. రెండ్రోజుల పాటు అతడు కూడా అదే గదిలో ఉన్నాడు.
Also Read: అది జరిగితే మరుసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
సచిన్ రాజ్‌పుత్ మద్యం మత్తులో తన స్నేహితుడు అనుజ్‌తో కలిసి రితికాను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అనుజ్ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతోనే ఈ వ్యవహారం బయటపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు.