/rtv/media/media_files/2025/02/05/Cf1jmmHLNtbt15fs8p6C.jpg)
Cyber Crime
Cyber Crimes: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా థాయ్‌లాండ్(Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్లకు నిలయంగా ఉన్న మయన్మార్(Mayanmar)లోని సరిహద్దు పట్టణాలకు విద్యుత్ కరెంట్ సరఫరాను నిలిపివేసింది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో థాయ్‌లాండ్ ఈ చర్యలు చేపట్టింది.
Also Read: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!
మయన్మార్‌తో పాటు కాంబోడియా, లావోస్ దేశాల నుంచి ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. థాయ్‌లాండ్‌కు సరిహద్దులో ఉన్న మైవాడీ, టాచిలెక్ వంటి మయన్మార్ పట్టణాలు సైబర్ నేరాలకు అడ్డాగా మారాయి. అమ్మాయిలతో వలపు వల వేయడం, బోగస్ పెట్టుబడులు, అక్రమ జూదం వంటి ఆన్‌లైన్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటినుంచి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల దోపిడీ జరుగుతున్నట్లు అంచనా ఉంది.
Also Read: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్!
సైబర్ నేరాలకు కేంద్రాలుగా..
అయితే తాజాగా థాయ్‌లాండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సహా ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు సమావేశమయ్యాయి. సైబర్ నేరాలకు కేంద్రాలుగా ఉన్న మయన్మార్‌లో ఐదు పట్టణాలకు కరెంటు, ఇంటర్నెట్, గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలాఉండగా.. మయన్మార్‌లోని పలు పట్టణాలకు థాయ్‌లాండ్ విద్యుత్‌ను విక్రయిస్తోంది. రాజధాని బ్యాంకాక్‌లోని ప్రాంతీయ విద్యుత్ సంస్థ ప్రకారం చూసుకుంటే వీటి నుంచి ఏడాదికి 17.9 మిలియన డాలర్ల ఆదాయం వస్తుందని అధికారిక లెక్కలు చెబుతున్నయి. కానీ సైబర్ నేరాల వల్ల థాయ్‌లాండ్‌లో రోజుకు 2.3 మిలియన్ డాలర్ల నష్టం జరుగున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read: బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్‌పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!
Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం