TGSP: బెటాలియన్ కానిస్టేబుళ్లకు మరో షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. ఇకనుంచి సెక్రటేరియట్‌లో ఎస్పీఎఫ్‌ పోలీసులు గస్తీ కాయనున్నారు.

Betallion
New Update

Telangana : తెలగాణలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు మద్దతుగా వాళ్ల భార్యలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే టీజీఎస్పీకి సెలవుల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసింది. అలాగే సీఎం రేవంత్‌ ఇంటి వద్ద, డిజీపీ ఆఫీసు వద్ద సెక్యూరిటిగా ఉన్న ఈ కానిస్టేబుళ్లను కూడా వేరే చోటుకి తరలించింది. 

Also Read: రేవంత్‌ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్

సెక్రటేరియట్ నుంచి తొలగింపు

 తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని భద్రతలో మార్పులు చేపట్టింది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. ఇప్పటివరకు సచివాలయ భద్రతను ఈ బెటాలియన్ కానిస్టేబుళ్లే పర్యవేక్షించారు. ప్రస్తుతం వీళ్ల నుంచి ఆందోళనల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సెక్రటేరియట్‌లో ఎస్పీఎఫ్‌ పోలీసులు గస్తీ కాయనున్నారు. 

Also read: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ !

తెలంగాణ సెక్రటేరియట్‌ భద్రలో మార్పులు చేస్తూ.. బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, ఐదేళ్ల పాటు తమను ఒకే చోట పనిచేయించాలని, ఆ తర్వాత ఏఆర్‌, సివిల్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఇప్పించాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను వెట్టిచాకిరి కోసం వాడుకుంటున్నారని కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీస్ ఇప్పటిదాకా 49 మందిని సస్పెండ్ చేసింది. మరోవైపు బైదరాబాద్‌లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 

Also Read: తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతక్షంలోకి పంపిన చైనా..

Also Read: లారెన్స్ బిష్ణోయ్‌ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్

#telugu-news #telangana #secratariate #tgsp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe