రేవంత్‌ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

New Update
High Court revanth

తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన జరగనుంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌కు బిగ్ షాక్‌ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. 

Also read: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ !

నవంబర్ 6 నుంచి కులగణన చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఈ సర్వేకు మరికొన్నిరోజుల పాటు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. మరోవైపు త్వరలోనే అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వే వల్ల అందిరిలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని.. ఇక భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణను అనుసరిస్తుందని తెలిపారు. 

Also Read: రేవంత్‌కు బిగ్ షాక్..కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

నవంబర్ 6న రాహుల్ గాంధీని తెలంగాణకు ఆహ్వానించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో అనేదానిపై స్పష్టత వచ్చే ఛాన్స్‌ ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపట్టనుంది. అయితే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు