కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ !

తెలంగాణలో గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరీ.. తాజాగా కొండగట్టలో ప్రత్యక్షమైంది. స్వామివారిని దర్శించుకొని.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంది. అనంతరం అఘోరీ వేములవాడ, కొమురవెల్లి ఆలయాలకు కూడా వెళ్లనుంది.

New Update

Lady Aghori: తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ నాగసాధువు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే.. కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.  ఈ మహిళా అఘోరీ తెలంగాణలోని పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. ఇటీవలే  సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ  గుడిలో పూజలు చేసింది. అక్కడ పూజలు చేస్తున్న సమయంలో నగ్నంగా ఉన్నఈ మహిళా అఘోరిని చూసి భక్తులు షాకయ్యారు. 

Also Read : ఓటీటీలో సుహాస్ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?

కొండగట్టులో 

తాజాగా ఈ లేడీ అఘోరీ కొండగట్టలో ప్రత్యక్షమైంది. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది.   అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుంది. తర్వాత అఘోరీ వేములవాడ, కొమురవెల్లి ఆలయాలకు కూడా వెళ్లనుంది. 

ఆత్మార్పణ 

ఇది ఇలా ఉంటే ఇటీవలే అక్టోబర్ 29న ఈ మహిళా అఘోరీ  సంచలన ప్రకటన చేసింది. నవంబర్‌ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటన చేసింది. సనాతన ధర్మంపై పోరాటంలో తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రశ్నించింది.

Also Read:Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

దాడి చేసిన వ్యక్తుల్ని తమకు అప్పగించాలని కోరింది. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తానని తెలిపింది. ఈ ఆత్మార్పణలో మరణం నుంచి బయటపడితే.. సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళతానని పేర్కొంది. ఒకవేళ మరణిస్తే శివయ్య దగ్గరకే వెళతా అని తెలిపింది. తెలంగాణలోకి ఇప్పుడే వచ్చా రేపు కొండగట్టు, వేములవాడ వెళతానని చెప్పింది. అలాగే గురువారం కొమురవెల్లి, ఏడుపాయలకు వెళతానని తెలిపింది. 

Also Read :  దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

Also Read : యష్మీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ..

Advertisment
తాజా కథనాలు