లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. తన అనచరుడు పవన్ షూకీన్‌తో కలిసి జైల్లోనే లారెన్స్ బిష్ణోయ్‌ను అంతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 30 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉంటున్న అతడిని హత్య చేసేందుకు మరో క్రిమినల్ మూఠా కుట్రకు పన్నినట్లు తెలుస్తోంది. బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ.. తన అనచరుడు పవన్ షూకీన్ అలియస్ సోనూతో కలిసి లారెన్స్ బిష్ణోయ్‌ను ఖతం చేసేందుకు ప్లాన్ వేసినట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న పవన్.. ఇద్దరు షూటర్లను అక్టోబర్ 26న ఢిల్లీ రాణీబాగ్‌లోని ఓ వ్యాపారవేత్త ఇంటి దగ్గర కాల్పులు జరిపారు. Also Read: 500 ఏళ్ల తరువాత అక్కడ దీపావళి సంబరాలు జైల్లోనే హత్య ఆ తర్వాత అతడిని రూ.15 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాపారవేత్త డబ్బు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ ఆ ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ల నుంచి సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దర్యాప్తు చేయగా లారెన్స్‌ను చంపేందుకు ఢిల్లీ జైల్లో ఉన్న కశాల్ చౌధ్రీ ప్లాన్ వేస్తున్న విషయం బయటపడింది. ఇందుకోసం డబ్బులు సమీకరించేందుకే నిందితులు ఆ వ్యాపారవేత్తను బెదిరించినట్లు తెలిసింది. కుశాల్ చౌధ్రీని 2019లో థాయ్‌ల్యాండ్‌లోఅరెస్టు చేసి ఇండియాకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడి స్థావరాలపై వరుసగా దాడులు చేసి నియంత్రించింది. సింగర్ సిద్ధూమూసేవాల హత్యకు ప్రతీకారంగా లారెన్స్ బిష్ణోయ్‌ను చంపుతామని కుశాల్ 2022లోనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే 2023లో అతడు పోలీస్ కస్టడీలో ఉండగా సూసైడ్ చేసుకునేందుకు యత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. Also Read: ఆ ఊరిపై పగబట్టిన పాము.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు! ఇదిలాఉండగా.. లారెన్స్ బిష్ణయ్ కూడా ఈ బంబిగా గ్యాంగ్ లీడర్ కుశాల్‌ను అంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సబర్మితి జైల్లో ఎన్‌ఐఏ అతడిని ప్రశ్నించింది. తన హిట్ లిస్టులో కుశాల్ కూడా ఉన్నాడని లారెన్స్ చెప్పినట్లు సమాచారం. #telugu-news #national-news #lawrence-bishnoi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి