China: తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతక్షంలోకి పంపిన చైనా..

చైనా తొలిసారిగా తమ దేశం నుంచి ముగ్గురు వ్యోమగాముల్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రంలోకి తరలించింది. అందులో ఓ మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. ఆరు నెలల పాటు వీళ్లు అక్కడే ఉండి ప్రయోగాలు చేపట్టనున్నారు.

New Update
china Space

చైనా తొలిసారిగా తమ దేశం నుంచి ఓ మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపింది. తాజాగా గన్స్‌ ప్రావిన్స్‌లోని ప్రావిన్స్‌లోకి జియూక్వియాన్ స్పేస్ సెంటర్ నుంచి షెంఝూ-19 మిషిన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు యువ వ్యోమగాములను తమ సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రమైన తియాంగాంగ్‌కు తరలించింది. ఈ ప్రాజెక్టు కోసం లాంగ్‌మార్చ్‌-1 ఎఫ్‌ అనే భారీ రాకెట్‌ను వినియోగించారు. వ్యోమగాముల్లో 34 ఏళ్ల మహిళా స్పేస్ ఫ్లైట్ ఇంజినీర్ వాంగ్ హవూజె కూడా ఉన్నారు.  

Also Read: హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా నయూం ఖాసీ.. ఇజ్రాయెల్‌ సంచలన వార్నింగ్

ఆరు నెలలు అక్కడే

దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం జరిగిన తర్వాత వాళ్లు స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వీళ్ల స్పేస్‌షిప్ అంతరిక్ష కేంద్రం కోర్‌మాడ్యూల్‌ తియాన్హేతో అనుసంధానమైంది. ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌ ఆరు నెలల పాటు ఆ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారు. అక్కడ వివిధ ప్రయోగాలు చేస్తారు, స్పేస్‌వాక్‌లు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చిన అనుభవంతో 2030 నాటికి చంద్రుడిపైకి యాత్రను చేపట్టనున్నారు. ఇప్పటికే తాము చేపట్టిన ప్రయోగం సక్సెస్ అయ్యిందని చైనా మ్యాన్డ్ స్పెస్ ఏజెన్సీ (CMSA) ప్రకటన చేసింది. 

Also Read :  ఓటీటీలో సుహాస్ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?

నాసాని వెనక్కి నెట్టుతాం

ఈ వ్యోమగాములు వివిధ రంగాలకు చెందిన మొత్తం 86 ప్రయోగాలు నిర్వహిస్తారని.. మా మిత్రదేశాల వ్యోమగాములకు సైతం ట్రైనింగ్ ఇచ్చే దానిపై చర్చలు జరుగుతున్నాయని.. సీఎంఎస్‌ఏ ప్రతినిధి తెలిపారు. ఇదిలాఉండగా ఈ ఏడాది మొత్తం 100 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టి నాసాను వెనక్కి పంపి మొదటిస్థానంలోకి రావాలని చైనా లక్ష్యం పెట్టుకుంది. అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదగాలని రెండేళ్ల క్రితమే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. 

Also Read: ఆ ఊరిపై పగబట్టిన పాము.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు!

అయితే చైనాలో అంతరిక్ష కార్యక్రమాన్ని ఆ దేశ సైన్యం నిర్వహిస్తోందని కొన్నేళ్లక్రితమే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చైనాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి దూరం పెట్టారు. దీంతో చైనా సొంతంగానే తియాంగాంగ్ పేరిట ఏర్పాటు స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని ప్రయోగాలు చేపడుతోంది.  

Also Read :  'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు