/rtv/media/media_files/2025/10/27/doctor-sexually-assaulted-after-being-mistaken-for-an-army-officer-2025-10-27-13-52-34.jpg)
Doctor sexually assaulted fake Army officer
CRIME : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ డెలివరీ బాయ్ వైద్యురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న నిందితుడు ఆరవ్ మాలిక్ సోషల్ మీడియాలో తనను తాను ఆర్మీ అధికారిగా పేర్కొంటూ.. ఇటీవల ఓ వైద్యురాలి తో పరిచయం ఏర్పరుచుకున్నాడు. సదరు డాక్టర్ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. ఆమెకు ఆరవ్ ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు.
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అధికారినని చెప్పి వైద్యురాలిని ఆరవ్ ట్రాప్ చేశాడు. దానికి తగినట్లు ఆమెను నమ్మించేలా సైనిక యూనిఫాం ధరించిన ఫొటోలను ఆమెకు పంపించాడు. ఆ విషయం నిజమేనని నమ్మిన డాక్టర్ వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకోవడం ప్రారంభించారు. ఆ పరిచయం కాస్తా ఇంటి వరకు వెళ్లేలా చేసింది. ఈనెల వైద్యురాలి ఇంటికి వెళ్లిన మాలిక్ మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఆమెకు ఇచ్చాడు. భోజనం చేసిన అనంతరం వైద్యురాలు మత్తులోకి జారుకుంది.
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. అక్కడి నుంచి పారిపోయాడు. స్పృహలోకి వచ్చిన అనంతరం వైద్యురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించించింది. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. వైద్యురాలిని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఆన్‌లైన్‌లో ఆర్మీ యూనిఫాం కొనుగోలు చేసినట్లు తెలిసింది... దాన్ని ధరించి ఫొటోలు పంపేవాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Husband Suicide: 'మీ అమ్మను ఇంట్లో నుంచి గెంటేయ్'.. భార్య గొడవతో భర్త సూసైడ్
Follow Us