BIG BREAKING: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన.. 12 రాష్టాల్లో SIR

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) 12 రాష్ట్రాల్లో, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది.

New Update
Chief Election Commissioner Gyanesh Kumar

Chief Election Commissioner Gyanesh Kumar

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) 12 రాష్ట్రాల్లో, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది. బీహార్ అసెబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ చేపడుతామని వెల్లడించింది. మొదటి దశ SIR బీహార్‌లో జరిగిన సంగతి తెలసిందే. దీనిపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై వివాదం నెలకొనడంతో ఈసీ కూడా దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాము విజయవంతంగా బీహార్‌లో SIR నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.  

'' SIR లాంటి ప్రక్రియను ఎందుకు చేపట్టాలో  కొన్ని కారాణాలు ఉన్నాయి. తరచుగా వలసలు జరుగుతుండటం వల్ల ఓటర్లు వివిధ ప్రాంతాల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించకపోవడం, విదేశీయులను తప్పుగా చేర్చడం లాంటివి జరుగుతున్నాయని'' జ్ఞానేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, లక్షద్వీప్‌, అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో, గోవా, పుదుచ్చేరిలో SIR నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

SIR షెడ్యూల్‌కు సంబంధించి ఆక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ప్రింటింగ్, ట్రైనింగ్ ఫేజ్ ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలించే ప్రక్రియ జరగుతుంది. డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ను డిసెంబర్ 9న విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు డిసెంబర్ 9 నుంచి జనవరి 8, 2026 వరకు చేయవచ్చు. అలాగే డిసెంబర్ 9 నుంచే వచ్చే ఏడాది జనవరి 31 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక తుది ఎలక్టోరల్ లిస్టును ఫిబ్రవరి 7న విడుదల చేస్తారు.  

Advertisment
తాజా కథనాలు