Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!

ఆఫ్గానిస్తాన్‌ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్‌ చీఫ్‌ హిబాతుల్లా అఖున్‌ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.

New Update
afghan

afghan

ఆఫ్గానిస్తాన్‌ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్‌ చీఫ్‌ హిబాతుల్లా అఖున్‌ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.కాందహార్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..షరియా చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

Also Read:Ghibli images: జీబ్లీ వాడడాన్ని తగ్గించండి, మా సిబ్బందికి నిద్ర కావాలి: ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మాన్

ఇందుకు సంబంధించిన ఆడియోను తాలిబన్‌ అధికార ప్రతినిధి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. '' పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన చట్టాలు మాకు అవసరం లేదు. మాకు అవసరమైన చట్టాలను మేం రూపొందించుకుంటామని హిబాతుల్లా స్పష్టం చేశారు.

Also Read: Earthquake: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్

తమ వర్గానికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఏకమయ్యాయని ఆరోపించారు. ఆఫ్గానిస్తాన్‌ లో ప్రజాస్వామ్యం ముగిసిందన్న ఆయన..దానికి మద్దతుపలుకుతున్న వారు తమ ప్రభుత్వం నుంచి ప్రజలను వేరు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

2021లో ఆఫ్గాన్‌ ను తమ నియంత్రణలోకి తీసుకున్న తాలిబన్లు అనేక ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.బాలికల చదువు పై పరిమితులు విధించడంతోపాటు మహిళల ఉద్యోగాల పైనా ఆంక్షలు విధించారు.

మహిళలు సినిమాలు చూడవద్దని,ఒంటరిగాబయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తోంది.ఇలా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న తాలిబన్లతో దౌత్య సంబంధాలను కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు అనాసక్తి చూపిస్తున్నాయి.కేవలం చైనా,యూఏఈ వంటి దేశాలతోనే ఆఫ్గాన్‌ ప్రస్తుత పాలకులు సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తమలో ప్రతిపక్షం లేదని తాలిబన్లు చెబుతున్నప్పటికీ...అఖున్‌ జాదా వర్గంతో పాటు నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ పై తాలిబన్లలోనే తీవ్ర అభిప్రాయబేధాలు ఉన్నట్లు సమాచారం. 

Also Read: Jagga Reddy Teaser Launch : నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను. టీజర్ లాంఛ్ లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.!

Also Read: Srisaila Devasthanam : శ్రీశైలంలో ఘనంగా ఉగాది బ్రహ్మోత్సవాలు....శివనామస్మరణతో మారుమోగిన శ్రీగిరులు

afghanistan | pakistan-vs-afghanistan | taliban | leader | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు